క్రీడలు

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2018 టోర్నమెంట్ లో భాగంగా నేడు పూల్-ఏ లోని నాలుగు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు అర్జెంటీనా, స్పెయిన్‌ తలపడనున్నాయి. సాయత్రం 7 గంటలకు న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌ తలపడనున్నాయి.

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచ కప్ 2018 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

ఒడిషా: భువనవేశ్వర్ లోని కళింగస్టేడియం వేదికగా నవంబర్ 28వ తేదీ బుధవారం నుంచి 14వ మెన్స్ ప్రపంచం హాకీ కప్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. 19 రోజులు 36 మ్యాచ్ లు జరగనున్నాయి.

భారత మహిళల క్రికెట్ జట్టులో చెలరేగిన వివాదం ముదరుతోంది. టీ20 వరల్డ్‌కప్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను సెమీస్‌లో పక్కన పెట్టడంపై మిథాలీ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాశారు.

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ రాష్ట్ర బాట్మింటన్ డబుల్స్ జట్టుకు చెందిన క్రీడాకారుడు తిర్నాకూర్ నాగ్ కరెంటు షాక్ గురై సోమవారం మరణించాడు.

హైదరాబాద్ : భారత మహిళా క్రికేటర్ మిథాలీ రాజ్ తొలగింపు తీవ్ర దుమారం రేపుతోంది. మహిళా టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ను దూరం పెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన కొందరు టీఆర్ఎస్ ఫ్యాన్స్ 'ఓట్ ఫర్ కేసీఆర్' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో ఆల్‌రౌండర్ కృనాల్‌ పాండ్య కీ రోల్ ప్లే చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ వెన్నువిరిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై కృనాల్ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు.

హైదరాబాద్ : భారత బాక్సర్ మేరీకోమ్ పై టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి మహిళా బాక్సర్ గా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 165 పరుగుల టార్గెట్‌ను కోహ్లి సేన ఛేదించింది. 19.4 ఓవర్లలో కోహ్లి సేన 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

Pages

Don't Miss