‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’.. అంటున్న ఆలీ..

‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’.. అంటున్న ఆలీ..

ABAN Movie Launching: కామెడీ కింగ్ ఆలీ, సీనియర్ నరేష్, మౌర్యానీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా.. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’.. (ఆల్ ఈజ్ వెల్) అనేది ట్యాగ్ లైన్.. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో, ఆలీ సొంత బ్యానర్ ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, బాబీ, కెమెరామెన్&డైరెక్టర్ ఎస్.గోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మూవీ టీంను అభినందించారు. ఆలీ, నరేష్, మౌర్యానీలపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి క్లాప్ నివ్వగా, ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. బాబీ, బోయపాటి కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియనున్నాయి.

Image

Image

Image

Image