Thindibothu Dayyam : ‘తిండిబోతు దెయ్యం’.. టైటిల్ భలే ఉందే.. మొదలైన హారర్ కామెడీ కొత్త సినిమా..

హారర్ కామెడీ నేపథ్యంలో ఈ తిండిబోతు దయ్యం సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

Thindibothu Dayyam : ‘తిండిబోతు దెయ్యం’.. టైటిల్ భలే ఉందే.. మొదలైన హారర్ కామెడీ కొత్త సినిమా..

Thindibothu Dayyam New Horror Comedy Movie Announced

Updated On : April 30, 2024 / 4:33 PM IST

Thindibothu Dayyam : శ్రీ శౌర్య క్రియేషన్స్ బ్యానర్ పై మొదటి సినిమాగా తెరకెక్కుతుంది ‘తిండిబోతు దెయ్యం’. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా స్వీయ దర్శకత్వనిర్మాణంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కామెడీ సినిమాల డైరెక్టర్ రేలంగి నరసింహారావు గెస్ట్ గా వచ్చారు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ తిండిబోతు దయ్యం సినిమాని తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ టైటిల్ వినడంతో భలే ఉంది టైటిల్ అని సినిమాపై ఆసక్తి నెలకొంది.

Also Read : Prasanth Varma : ఆ వీడియో చూసి ఏడ్చేసిన ‘హనుమాన్’ డైరెక్టర్.. తను చదివిన స్కూల్ నుంచి స్పెషల్ వీడియో..

తిండిబోతు దెయ్యం సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… కామెడీ ఎప్పటికి ఎవర్ గ్రీన్. కామెడీకి హారర్ మిక్స్ చేస్తే ఇప్పుడు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా హారర్ కామెడీనే. నరసింహ బోదాసు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. హీరోయిన్స్ ను చూస్తూంటే ముచ్చటగా ఉంది. ఈ ఆసక్తికర టైటిల్ తిండిబోతు దెయ్యంని విడుదలకు ముందు బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Thindibothu Dayyam New Horror Comedy Movie Announced

ఇక ఈ సినిమా దర్శక నిర్మాత, హీరో నరసింహ బోదాసు మాట్లాడుతూ..కొన్ని ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. కొత్త కథలతో సినిమాలు తీయాలని ఈ శ్రీ శౌర్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థని స్థాపించాము. తిండిబోతు దెయ్యం అందర్నీ నవ్విస్తూనే భయపెట్టి మెప్పిస్తుంది అని తెలిపారు.