Prasanth Varma : ఆ వీడియో చూసి ఏడ్చేసిన ‘హనుమాన్’ డైరెక్టర్.. తను చదివిన స్కూల్ నుంచి స్పెషల్ వీడియో..

తాజాగా ప్రశాంత్ వర్మ ఓ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు.

Prasanth Varma : ఆ వీడియో చూసి ఏడ్చేసిన ‘హనుమాన్’ డైరెక్టర్.. తను చదివిన స్కూల్ నుంచి స్పెషల్ వీడియో..

Prasanth Varma shares a Video gets from his Childhood School and says he got Tears

Updated On : April 30, 2024 / 3:31 PM IST

Prasanth Varma : దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పాన్ ఇండియా టాపిక్ అయ్యాడు. ‘అ’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఇటీవల హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. హనుమాన్(Hanuman) సినిమా ఏ రేంజ్ లో విజువల్ ఫీస్ట్ గా మనందరినీ మెప్పించిందో తెలిసిందే. చిన్న సినిమాతో 300 కోట్లు కొట్టి, ఈ రోజుల్లో 100 రోజులు ఆడించి సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ.

దీంతో ప్రశాంత్ వర్మ రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు దర్శకుడిగానే కాక ప్రశాంత్ వర్మలో క్రికెటర్, డ్రమ్స్ వాయించడం ఇలా చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ వర్మ చిన్నప్పుడు సరస్వతి శిశుమందిర్ స్కూల్ లో చదివాను అని తెలిపాడు. భారతదేశంలోని బెస్ట్ స్కూల్స్ లో సరస్వతి శిశుమందిర్ విద్యాలయాలు ఒకటి. అక్కడ చదువుతో పాటు మన ధర్మం, సంస్కృతి.. అన్ని బోధిస్తారు.

Also Read : Mega Family – Sagar : మెగా ఫ్యామిలీతో.. మొగలిరేకులు RK నాయుడుకు అంత మంచి అనుబంధం ఎలా ఏర్పడింది..?

తాజాగా ప్రశాంత్ వర్మ ఓ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు. తాను చిన్నప్పుడు చదివిన పాలకొల్లు శ్రీ సరస్వతి శిశుమందిర్ నుంచి సినిమా రిలీజ్ ముందు రోజు ఓ వీడియో వచ్చిందని, ఆ వీడియో చూసి నాలో కన్నీళ్లు బయటకి వచ్చాయి. దాన్ని ఇప్పుడు షేర్ చేస్తున్నాను అని ఆ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో తాను చదివిన స్కూల్ ని చూపించి, ఇప్పటి స్టూడెంట్స్ తో హనుమాన్ అని వచ్చేలా గ్రౌండ్ లో కూర్చోబెట్టి, అనంతరం తనకు చదువు చెప్పిన టీచర్లు, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న టీచర్లు, స్టూడెంట్స్ అందరూ ప్రశాంత్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాను చదివిన స్కూల్ నుంచి తనని అభినందిస్తూ, తనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ వీడియో రావడంతో ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. మీరు కూడా ఈ సూపర్ వీడియో చూసేయండి.