గూగుల్‌కు మీ ప్రతి మూమెంట్ తెలుసు.. ట్రాకింగ్ పర్సనల్ డేటాను ఇలా డిలీట్ చేసుకోండి!

గూగుల్‌కు మీ ప్రతి మూమెంట్ తెలుసు.. ట్రాకింగ్ పర్సనల్ డేటాను ఇలా డిలీట్ చేసుకోండి!

Google Web and Activity Tracking Data Delete : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ యూజర్ల డేటాను ఎప్పటికప్పుడూ స్టోర్ చేస్తుంటుంది. ఎవరైతే జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అవుతారో వారు వాడే బ్రౌజర్ ద్వారా డేటాను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏది సెర్చ్ చూశారు? ఏ లొకేషన్ లో ఉన్నారు? ఇప్పుడు ఆన్ లైన్ లో ఏం వెతుకున్నారు అంతా మీ డేటాను గూగుల్ పసిగడుతూనే ఉంటుంది.

మీ ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి తమ డేటా సర్వర్లలో స్టోర్ చేస్తుంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ద్వారా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా ట్రేస్ చేస్తుంది. యూట్యూబ్ లో ఏం వీడియోలు చూశారో కూడా చెప్పేస్తుంది. మీ ప్రైవసీకి ఇబ్బందిగా అనిపిస్తే.. వెంటనే గూగుల్ స్టోర్ చేసిన మీ పర్సనల్ డేటాను వెంటనే డిలీట్ చేసుకోవచ్చు.

ప్రైవసీ కోరుకునే యూజర్ల కోసం గూగుల్ ప్రత్యేకించి యాక్టివిటీ డేటా టూల్ ఒకటి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ టూల్ ఉపయోగించి డేటాను పర్సనల్ డేటాను గూగుల్ సర్వర్ల నుంచి ఎలా డిలీట్ చేసుకోవచ్చో చూద్దాం..

– గూగుల్ పేజీలో google.com విజిట్ చేయండి.

– మీ జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వండి.

– రైట్ టాప్ కార్నర్ లో ఒక సర్కిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

– Mangage Your Google Account ఆప్షన్ పై క్లిక్ చేయండి.

– Data & Personalization అనే ఆప్షన్ కింద యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది.

– యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ కింద My Activity అనే బటన్ పై క్లిక్ చేయండి.

మీ డేటాను గూగుల్ ట్రాక్ చేయకుండా ఆపేయండి :

– గూగుల్ పేజీలో google.com విజిట్ చేయండి.

– మీ జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వండి.

– రైట్ టాప్ కార్నర్ లో ఒక సర్కిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

– Mangage Your Google Account ఆప్షన్ పై క్లిక్ చేయండి.

– Data & Personalization అనే ఆప్షన్ కింద యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది.

– Web & App activity tracking, Location History, YouTube History చెక్ మార్క్స్ కనిపిస్తాయి.

– గూగుల్ మీ డేటాను ట్రాక్ చేయకుండా ఉండాలంటే చెక్ మార్క్ ఆఫ్ చేసేయండి చాలు.

గూగుల్ స్టోర్ చేసిన మీ డేటా డిలీట్ చేయడం ఎలానంటే? :

– గూగుల్ పేజీలో google.com విజిట్ చేయండి.

– మీ జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అవ్వండి.

– రైట్ టాప్ కార్నర్ లో ఒక సర్కిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

– Mangage Your Google Account ఆప్షన్ పై క్లిక్ చేయండి.

– Data & Personalization అనే ఆప్షన్ కింద యాక్టివిటీ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది.

– లెఫ్ట్ నేవిగేషన్ ప్యానెల్ పక్కన Data & Personalization ఆప్షన్ పై క్లిక్ చేయండి.

– Web & App Activity బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత Manage Activity కనిపిస్తుంది.

– మీ డేటా యాక్టివిటీకి సంబంధించి లిస్టు ఒకటి కనిపిస్తుంది.

– మూడు డాట్ల ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి.. డిలీట్ అనే బటన్ పై క్లిక్ చేయండి.

– ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

– మూడు నెలల నుంచి 18 నెలల వరకు కూడా ఎంచుకోవచ్చు.