హెయిర్ ఫాలింగ్… ఎలా కాపాడుకోవాలి!

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 11:19 AM IST
హెయిర్ ఫాలింగ్… ఎలా కాపాడుకోవాలి!

Updated On : May 28, 2020 / 3:41 PM IST

నలుగురు ఆడవాళ్లు కలిశారంటే ‘అబ్బ.. నీ హెయిర్ ఎంత బాగుందో. నాకైతే తెగ రాలిపోతోంది. ఏం వాడుతున్నావో కొంచెం చెప్పవా..’ అంటూ మాట్లాడుకోవడం సహజం. జుట్టు రాలడమనే సమస్య అంత ఎక్కువగా ఉంటోంది మరి. ఒకవైపు హార్మోన్ సమస్యలు.. మరో పక్క జన్యుపరమైన కారణాలు.. కలిసి జుట్టు రాలే సమస్య ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటోంది. మరి ఈ సమస్యను తగ్గించేది ఎలా..?

ఒకప్పుడు జుట్టు రాలిపోవడం ఆడవాళ్ల సమస్య. కానీ ఇప్పుడు మాత్రం ఆడ, మగ తేడా లేకుండా అందరి సమస్యలా మారింది. హెయిర్ ఫాలింగ్ కి అనాజెన్ ఎఫ్లుయెమ్, టిలోజెన్ ఎఫ్లుయెమ్, ఇంకోటి జెనెటిక్ కారణాల వల్ల వచ్చే ఆండ్రోజెనిక్ అలోపేషియా అని మూడు కారణాలు. ఇలా మూడు కారణాలుంటాయి.
Also Read : హెల్త్ టిప్ : ఎడమ వైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే

ఆండ్రోజెనిక్ అంటే బట్టతల. వీళ్లకి ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే హెయిర్ లాస్ అవుతుంది. టీలోజెన్ ఎఫ్లుయెమ్ ఉన్నప్పుడు సాధారణంగా వాళ్లకు హెయిర్ మొత్తంగా పోతుంటుంది. ఐరన్ లోపం ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, బయోటిన్ లోపం, విటమిన్ బి12, విటమిన్ డి లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ పెరుగుతున్నట్టు గమనిస్తున్నాం.  

* జుట్టును ఎలా కాపాడుకోవాలి?
జుట్టు రాలిపోవడానికి కారణాలెన్నో చూశాం కదా. మరి ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. జుట్టు రాలకుండా కాపాడుకోవాలంటే ముఖ్యంగా హెయిర్ వాష్, హెయిర్ కేర్ హ్యాబిట్స్ కరెక్ట్ చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు, మినరల్స్ ఎక్కువ అందేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకోవాలి. పప్పులు, స్ప్రౌట్స్, ఎక్కువగా తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ప్రాబ్లం ను కరెక్ట్ చేస్తాయి. 

తరువాత వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేయాలి. డాండ్రఫ్ ఉంటే రోజు విడిచి రోజు కూడా చేయవచ్చు. హెయిర్ వాష్ తరువాత కండిషనర్ వాడటం. హెయిర్ స్టయిలింగ్ హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేయడం. ఇవన్నీ పాటించి అప్పటికి ప్రాబ్లం సాల్వ్ కాకపోతే డాక్టర్ ను కలవాలి.