Sehari : గంటలో పెళ్లి పెట్టుకుని పెళ్లికూతురు అక్కతో!.. యూత్‌కి నచ్చే రొమాంటిక్ ‘సెహరి’..
‘సెహరి’ మూవీతో టాలీవుడ్‌కి హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తుండగా, అక్షత కీలకపాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై శిల్పా చౌదరి, అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు..
Sehari: ‘సెహరి’ మూవీతో టాలీవుడ్‌కి హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తుండగా, అక్షిత కీలకపాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై శిల్పా చౌదరి, అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు.
గతకొద్ది రోజులుగా ఈ మూవీ టీజర్ గురించి యూనిట్ డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేపట్టింది. శుక్రవారం ‘సెహరి’ టీజర్ రిలీజ్ చేశారు. యూత్‌కి నచ్చేవిధంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రేమించిన అమ్మాయి మీద కోపంతో మరో అమ్మాయితో పెళ్లికి ఓకే చెప్పి తర్వాత రియలైజ్ అయ్యే కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్లో హర్ష్ కనిపించాడు. హీరో హీరోయిన్ల నటన, విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. త్వరలో ‘సెహరి’ ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : అరవింద్ విశ్వనాధన్, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల.