Bandi Sanjay : ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడతా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

కాంగ్రెస్‌కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డేనని, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అంటూ ఎద్దేవా చేశారు.

Bandi Sanjay : ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడతా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Bandi Sanjay

Updated On : May 5, 2024 / 10:51 PM IST

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read Also : Amit Shah Comments : దేశంలో రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు.. ఇది మోదీ గ్యారంటీ : అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అసభ్యంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలారా… ఖబడ్దార్ .. కాషాయ కార్యకర్తలు ఉరికించి కొడతారు… జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ మెడలు వంచేదాకా కొట్లాడతా నన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డేనని, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అంటూ ఎద్దేవా చేశారు.

గాడిదగుడ్డు మీదున్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై ఎందుకు లేదు రేవంతన్నా? అంటూ బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలను రాచిరంపాన పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దించిన చరిత్ర మాదన్నారు. లాఠీదెబ్బలు, కేసులు, అరెస్టులు, జైళ్లకు భయపడకుండా రాజీలేని పోరు చేసినట్టు తెలిపారు.

కేసీఆర్ ఓ తుపాకీ రాముడు… జనాన్ని మోసం చేసేందుకు మళ్లీ మాయ మాటలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ మర్చిపోనంతగా ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. దేవుడి అక్షింతలు, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని బొంద పెడతామని బండి సంజయ్ విమర్శించారు.

Read Also : Kangana Ranaut : పాపం కంగనా రనౌత్‌.. పేరుతో తికమక.. సొంత పార్టీ నేతనే తిట్టిపోసింది!