శిబిరాజ్ ‘రంగ’ – టీజర్

ముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్, నిఖిలా విమల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 'రంగ' టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 28, 2019 / 11:43 AM IST
శిబిరాజ్ ‘రంగ’ – టీజర్

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్, నిఖిలా విమల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘రంగ’ టీజర్ రిలీజ్..

ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా.. ‘రంగ’.. నిఖిలా విమల్ హీరోయిన్‌గా నటిస్తుంది. వినోద్ డీఎల్ దర్శకత్వంలో, విజయ్ నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ‘రంగ’ టీజర్ రిలీజ్ చేశారు. ఫారెన్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

‘నీ లైఫ్ ఎండ్ అయిపోయింది’ అంటూ ఓ వ్యక్తి శిబిరాజ్‌తో చెప్తుండగా స్టార్ట్ అయిన టీజర్.. అనేక ఉత్కంఠ భరితమైన ములుపులు తిరిగి.. ‘నా లైఫ్ ఎండ్ అయిపోతుందని డిసైడ్ చెయ్యాల్సింది నువ్వు కాదు.. నేను’.. అని శిబిరాజ్ ఆన్సర్ ఇవ్వడంతో ఎండ్ అవుతుంది. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మేకింగ్, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

Read Also : కౌసల్య కృష్ణమూర్తి – ‘ముద్దబంతి’ వీడియో సాంగ్..

సతీష్, మోహ్నీష్ రహేగా తదితరులు నటిస్తున్న ‘రంగ’ ఆడియో త్వరలో విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : అరువి, మ్యూజిక్ : రామ్ జీవన్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, దినేష్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : దస్తా, విజ్జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కాంత్.