రాష్ట్రాలకు ఇసుక సరఫరాపై నిషేధం..ఏపీ కేబినెట్ నిర్ణయం

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 10:25 AM IST
రాష్ట్రాలకు ఇసుక సరఫరాపై నిషేధం..ఏపీ కేబినెట్ నిర్ణయం

ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టన్ను ఇసుక రూ. 375 ఖరారు చేసింది. కిలోమీటర్, రవాణా ఖర్చు రూ. 4.90, పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగనుంది. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఇసుక సరఫరాపై సుదీర్ఘంగా చర్చించింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా చేయడంపై నిషేధం విధించింది. 58 ఇసుక స్టాక్ పాయింట్లు ఉండనున్నాయి. ఏపీ ఎండీసీ ద్వారా ఆన్ లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోవాలని సూచించింది. దశల వారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 

ఇసుక నిక్షేపాలు ఉన్న వారు…సంసిద్ధత ఉన్న ఏ రైతు అయినా..ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే..క్యూబిక్ మీటర్‌కు 60 రూపాయలు ఆ రైతుకు చెల్లించి ఏపీ ఎండీసీ ఇసుకను కొనుగోలు చేస్తుందన్నారు. రైతు మీద మిషనరీ భారం..ఎలాంటి భారం ఉండకుండా.. ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇసుక రవాణా అత్యంత పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు.

ప్రజలు ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటే..టెండర్ల ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇసుకను తవ్వి..డాక్ యార్డులో నిల్వ చేయడం..జీపీఎస్ అమర్చిన వాహనాల్లో ఇసుకను తరలిస్తారన్నారు. ఇసుకను బుక్ చేసుకున్న వారు..వాహన నెంబర్‌తో పాటు ఎక్కడుందో ట్రాక్ ద్వారా చూసుకోవచ్చన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా, దోపిడి, మాఫియా లేకుండా చేసి..పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీ ఎండీసీకి మాత్రమే ఇసుక స్టాక్ యార్డు పెట్టుకొనేందుకు అవకాశం ఉందని..ఎవరైనా స్టాక్ నిల్వ చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకొనేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
Read More : ఏపీ కేబినెట్ నిర్ణయాలు : శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి