రాణీ ముఖర్జీ ‘మర్దానీ 2’ – ఫస్ట్‌లుక్

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ‘శివానీ శివాజీ రాయ్’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ ఫస్ట్‌లుక్ రిలీజ్ ..

  • Published By: sekhar ,Published On : September 30, 2019 / 10:41 AM IST
రాణీ ముఖర్జీ ‘మర్దానీ 2’ – ఫస్ట్‌లుక్

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ‘శివానీ శివాజీ రాయ్’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ ఫస్ట్‌లుక్ రిలీజ్ ..

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ.. ‘మర్దానీ 2’.. 2014లో వచ్చిన ‘మర్దానీ’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు గోపీ పుత్రన్ డైరెక్టర్.. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ‘మర్దానీ 2’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. రాణీ ముఖర్జీ లుక్ బాగుంది.

మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. రాణీ ముఖర్జీ నటనకు మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ మరింత ఆసక్తికరంగా సాగుతుందట. రాణీ ముఖర్జీ ‘శివానీ శివాజీ రాయ్’ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపించనుంది.

Read Also : సైరాకు శుభాకాంక్షలు..

రాజస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ సింగ్ చౌహాన్, శృతి బప్నా, రాజేష్ శర్మ తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 13న ‘మర్దానీ 2’ గ్రాండ్‌గా విడుదల కానుంది. మ్యూజిక్ : రచితా అరోరా, సినిమాటోగ్రఫీ : రవి చంద్రన్, సంతాన కృష్ణన్, ఎడిటింగ్ : రితేష్ సోనీ.