‘జూనియర్ బాలయ్య’ గోకుల్ మృతి
డెంగీ బారినపడి బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాల నటుడు గోకుల్ సాయి కృష్ణ మరణించాడు..

డెంగీ బారినపడి బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాల నటుడు గోకుల్ సాయి కృష్ణ మరణించాడు..
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. డెంగీ బారినపడి బాల నటుడు గోకుల్ చనిపోవటం కలకలం రేపుతోంది. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు గోకుల్ సాయి కృష్ణ. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఏవీ నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండో కుమారుడు గోకుల్ సాయి.
బాలకృష్ణ వీరాభిమాని. బాలయ్య నటించిన చిత్రాల్లోని పలు పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. బాలయ్య సైతం గోకుల్ సాయిని ప్రశంసించారు. బాలయ్య డైలాగులు చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే గోకుల్ రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరులోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు.
Read Also : అభిమాని మరణం – బాలయ్య భావోద్వేగం
డెంగీ తీవ్రత ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ గోకుల్ మరణించాడు. మంచి భవిష్యత్ ఉన్న గోకుల్ చిన్న వయసులో చనిపోవటంతో బాధాకరం. మరణ వార్త తెలిసి.. తనతో నటించిన పలువురు బాలనటులు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ అభిమానులు గోకుల్ సాయికృష్ణ మృతికి సంతాపం తెలుపుతున్నారు.