‘హోటల్ ముంబాయి’ ట్రైలర్ – నవంబర్ 29 ఇండియా రిలీజ్

2008లో ముంబాయి తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆస్ట్రేలియన్ - అమెరికన్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా రూపొందింది ‘హోటల్ ముంబాయి’.. నవంబర్ 29న ఇండియాలో విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 23, 2019 / 07:04 AM IST
‘హోటల్ ముంబాయి’ ట్రైలర్ – నవంబర్ 29 ఇండియా రిలీజ్

2008లో ముంబాయి తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆస్ట్రేలియన్ – అమెరికన్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా రూపొందింది ‘హోటల్ ముంబాయి’.. నవంబర్ 29న ఇండియాలో విడుదల కానుంది..

‘స్లమ్ డాగ్ మిలీనియర్’తో కెరీర్ స్టార్ట్ చేసి, ‘అబౌట్ చెర్రీ,’ ‘ది రోడ్ వితిన్’, ‘ఓన్లీ ఎస్టర్‌డే’, ‘లయన్’, ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న దేవ్ పటేల్ ‘హోటల్ ముంబాయి’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనుపమ్ ఖేర్, ఆర్మీ హ్యామర్, నజానిన్ బొనియాడి, నగేష్ బోస్లే కీలక పాత్రల్లో నటించారు.

2008లో ముంబాయి తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ‘సర్వైవింగ్ ముంబాయి’ అనే డాక్యుమెంటరీ ఆధారంగా, ఆస్ట్రేలియన్ – అమెరికన్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా రూపొందింది ‘హోటల్ ముంబాయి’.. ఆంథోని మారస్ దర్శకత్వం వహించగా, థండర్ రోడ్ పిక్చర్స్, ఆర్క్‌లైట్ ఫిలింస్, ఎలక్ట్రిక్ పిక్చర్స్, క్సెయిట్‌గిస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మించాయి.

Read Also : ఆ వెడ్డింగ్ కార్డ్ మాది కాదు బాబోయ్ : అలియా భట్

‘టొరెంటో ఇంటర్‌నేషనల్ ఫిలిం ఫెస్టివల్’, ‘ఆడిలైడ్ ఫిలిం ఫెస్టివల్’‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడు ఇండియాలో విడుదల చేయనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నవంబర్ 29న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ‘హోటల్ ముంబాయి’ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : వోకర్ బెర్టెల్‌మన్, సినిమాటోగ్రఫీ : నిక్ రెమీ మాథ్యూస్, ఎడిటింగ్ : పీటెర్, ఆంథోనీ మారస్.