ప్రభుత్వ లాంఛనాలతో తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 09:44 AM IST
ప్రభుత్వ లాంఛనాలతో తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు

తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు

తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు కొత్తపేటలోని విజయారెడ్డి ఇంటి నుంచి నాగోల్ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో రెవెన్యూ ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ విజయారెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు.

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు సురేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం(నవంబర్ 4,2019) మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహశీల్దార్‌ చాంబర్‌లోకి వెళ్లిన సురేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే తహశీల్దార్ ని సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. విజయారెడ్డిపై దాడి తర్వాత.. సురేశ్‌ తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడు కూడా గాయపడ్డాడు.

తహశీల్దార్ సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అంతా షాక్ కి గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిందితుడు సురేష్ ను ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.