Trinadha Rao Nakkina : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ఆ స్టార్ డైరెక్టర్ తండ్రి కన్నుమూత..
టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడి తండ్రి మరణించారు.

Director Trinadha Rao Nakkina Father Suryarao Passed Away
Trinadha Rao Nakkina : నేడు టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడి తండ్రి మరణించారు. ప్రియతమా నీవచట కుశలమా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మావా, నేను లోకల్.. సినిమాలతో హిట్స్ కొట్టాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇటీవలే రవితేజతో ధమాకా సినిమా తీసి 100 కోట్ల హిట్ కొట్టాడు త్రినాథరావు.
త్వరలోనే సందీప్ కిషన్ తో కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు. మరో వైపు నక్కిన నెరేషన్స్ అని నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు. ఇంతలోనే త్రినాథరావు ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా వయసు పైబడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రినాధరావు తండ్రి నక్కిన సూర్యారావు నేడు తెల్లవారుజామున మరణించారు. అయన మరణంతో త్రినాథరావు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి సడన్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్..
ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు త్రినాథరావు తండ్రికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.