HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి సడన్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్..
హరిహర వీరమల్లు నుంచి సడన్ అప్డేట్ వచ్చింది. ధర్మం కోసం చేసే యుద్దానికి డేట్ కి ఫిక్స్ చేశారు.

Pawan Kalyan HariHara VeeraMallu teaser update
HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ కాంపెయిన్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది.
అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ని ఇస్తూ అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మే 2న ఉదయం 9 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. ఆ అప్డేట్ టీజర్ అని పేర్కొన్నారు. ఒక యాక్షన్ కట్ తో అదిరిపోయే టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.
Also read : Mega Family – Sagar : మెగా ఫ్యామిలీతో.. మొగలిరేకులు RK నాయుడుకు అంత మంచి అనుబంధం ఎలా ఏర్పడింది..?
?????? ??? ?????? ⚔️?
Teaser of the much-anticipated #HariHaraVeeraMallu will be out on MAY 2nd @ 9:00 AM! ?#HHVMTeaserOnMay2nd ❤️?@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs pic.twitter.com/h69e6miNdE
— Mega Surya Production (@MegaSuryaProd) April 30, 2024