Shanmukh-Deepthi: దీప్తికి ఇదే షణ్ముఖ్ చివరి ముద్దు.. వీడియో వైరల్!
యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయి వారం గడిచిపోయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి..
Shanmukh-Deepthi: యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయి వారం గడిచిపోయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఏ సోషల్ మీడియా అయితే వాళ్ళని సెలబ్రిటీలను చేసిందో.. అదే సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు ఇద్దరూ విడిపోతున్నట్లు ఖరారైంది. సోషల్ మీడియాలో లైవ్ లోనే తన బంధాన్ని తలచుకుని దీప్తి సునయన కన్నీళ్లు పెట్టుకుంది.
Disha Patani: వింటర్లో కూడా చెమటలు పట్టిస్తున్న దిశా!
దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ కు బిగ్ బాస్ కారణమని సోషల్ మీడియా కోడై కూస్తుంది. షోలో సిరి షణ్ముఖ్ మధ్య వ్యవహారమే వీళ్ళ ప్రేమకు శత్రువై కొంపముంచిందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి ముచ్చటైన జంట విడిపోయింది.. అనుబంధం దూరమైంది. ఇప్పటికీ ఈ జంట బ్రేకప్ గురించి వాళ్ళ ఫాలోవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే మళ్లీ కలుస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో ఆశతో ఎదురుచూస్తున్నారు.
Karishma Tanna: అందంతో మతిపోగొట్టడమే నీ పనా కరిష్మా!
ఇలాంటి సమయంలో గతంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో.. అనుబంధంతో మెలిగారో తెలిపేలా ఓ వీడియో విడుదల చేశారు. షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్ సాంగ్ ‘మలుపు’ మేకింగ్ వీడియో ఇది. ఇందులో షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే కొంచెం జరగమంటూ దీప్తి వచ్చి అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని గొడవపడుతుంది.. ఎందుకు జరగవని వాదిస్తుంది’ అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది. ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.