Kajal Aggarwal – Gautam Kitchlu : కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుందో తెలుసా? కిచ్లు కాజల్‌ని ఏమని పిలుస్తాడో తెలుసా?

ఓ ఇంటర్వ్యూలో కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుంది, తన భర్త కాజల్ ని ఏమని పిలుస్తాడో తెలిపింది.

Kajal Aggarwal – Gautam Kitchlu : కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుందో తెలుసా? కిచ్లు కాజల్‌ని ఏమని పిలుస్తాడో తెలుసా?

Kajal Aggarwal shares Nick Names of her and Husband Gautam Kitchlu

Kajal Aggarwal – Gautam Kitchlu : 17 ఏళ్లుగా సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది కాజల్ అగర్వాల్. కరోనా సమయంలో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ ఫ్రెండ్ పెళ్ళిలో గౌతమ్ కిచ్లుని కలిసింది. అక్కడ్నుంచి వీరి స్నేహం మొదలయి ఆ తర్వాత ప్రేమగా మారింది. పదేళ్ల పరిచయం తర్వాత పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కాజల్ – గౌతమ్ కిచ్లు. ఇప్పుడు వీరికి ఒక బాబు కూడా.

త్వరలో కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు తెలుపుతుంది కాజల్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుంది, తన భర్త కాజల్ ని ఏమని పిలుస్తాడో తెలిపింది. గౌతమ్ కిచ్లు.. కాజల్‌ని ‘కన్నా’ అని పిలుస్తాడట. కాజల్ తన భర్త గౌతమ్‌ని ‘సామి’ అని పిలుస్తుందని తెలిపింది.

Also Read : Kajal Aggarwal : అతను నా కారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. నేను భయపడ్డాను..

ఈ రెండు పేర్లు తెలుగులో కూడా బాగా పాపులర్ కావడంతో ఫ్యాన్స్, నెటిజన్లు కాజల్, గౌతమ్ క్యూట్ గా భలే పిలుచుకుంటున్నారు, క్యూట్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.