Kajal Aggarwal : అతను నా కారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. నేను భయపడ్డాను..

సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Kajal Aggarwal : అతను నా కారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. నేను భయపడ్డాను..

Kajal Aggarwal Shares about her Embarrassing Experience

Updated On : May 21, 2024 / 10:59 AM IST

Kajal Aggarwal : చందమామ కాజల్ అగర్వాల్ ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి 17 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాజల్. కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన ‘సత్యభామ’(Satyabhama) సినిమా త్వరలో రాబోతుంది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఇంటర్వ్యూలో మీ ఫ్యాన్స్ చేసిన క్రేజీయెస్ట్ పని ఏదైనా చెప్పగలరా అని అడగగా కాజల్ సమాధానమిస్తూ.. క్రేజీ కాదు కానీ ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అదే మొదటి రోజు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నా కారవాన్ లోకి వచ్చి షర్ట్ తీసేసాడు. నేను భయపడ్డాను. నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి అతని చాతి మీద నా పేరు టాటూ వేయించుకున్నది చూపించాడు. వెంటనే ఇలా బిహేవ్ చేయకూడదు, అలా ఎలా చేస్తావు, ఇది కరెక్ట్ కాదు అని గట్టిగానే చెప్పాను. అది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. ఎవరూ అలా చేయకండి అని చెప్పింది.

Also Read : Anand Deverakonda : టాలీవుడ్‌లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి.. ఆనంద్ సంచలన వ్యాఖ్యలు..

దీంతో కాజల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అంత ధైర్యంగా కాజల్ కారవాన్ లోకి వెళ్లి షర్ట్ తీసేసి మరీ టాటూ చూపించిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో మరి.