Chiranjeevi : మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్..? మళ్ళీ ఆ డైరెక్టర్‌తోనే.. సినిమాలో ఇంకో మెగా హీరో కూడా..

తాజాగా చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చేసారని సమాచారం.

Chiranjeevi : మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్..? మళ్ళీ ఆ డైరెక్టర్‌తోనే.. సినిమాలో ఇంకో మెగా హీరో కూడా..

Megastar Chiranjeevi said ok to God Father Movie Director Mohan Raja Story

Updated On : May 21, 2024 / 1:34 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. తాజాగా చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చేసారని సమాచారం.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చి మంచి విజయమే సాధించారు. ఇప్పుడు ఇదే డైరెక్టర్ తో ఇంకో సినిమా ఓకే చేసారని టాలీవుడ్ సమాచారం. మోహన్ రాజా గాడ్ ఫాదర్ తర్వాత నాగార్జునతో ఒక సినిమా చేయాలని కథ కూడా చెప్పారంట. ఆ సినిమాలో అఖిల్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున ప్రస్తుతానికి ఆ కథ ఇంకా ఓకే చేయకపోవడంతో మోహన్ రాజా మెగాస్టార్ కి వినిపించినట్లు సమాచారం.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు షాకింగ్ ట్వీట్‌.. క‌న్న‌ప్ప టీజ‌ర్‌ను మ‌న‌కిప్పుడే చూపించ‌రంట‌..

మోహన్ రాజా చెప్పిన కథ విని చిరంజీవికి కథ నచ్చి సినిమా ఓకే చేసారని తెలుస్తుంది. ఇందులో చిరంజీవితో పాటు మరో మెగా హీరో కూడా నటిస్తాడని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవితో పాటు సాయి ధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మోహన్ రాజా – చిరంజీవి సినిమాలో భాగమవుతారని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.