Flipkart Big Billion Days: ఐఫోన్లపై ఫ్లిప్‭కార్ట్ క్రేజీ ఆఫర్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెడతారు

కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్‌లు కాకుండా బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల ఆధారంగా ఆఫర్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సేల్ ఈవెంట్‌ దగ్గరలో ఉంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదని గుర్తించుకోండి. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్ కోసం మీరు సపరేటుగా ఛార్జర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది మీకు అదనపు ఖర్చు అన్నమాటే.

Flipkart Big Billion Days: ఐఫోన్లపై ఫ్లిప్‭కార్ట్ క్రేజీ ఆఫర్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెడతారు

Apple iPhone 11 under Rs 13k and iPhone 12 mini at Rs 23k in Flipkart Big Billion Days sale 2022

Flipkart Big Billion Days: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) సెప్టెంబర్ 23న ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ (Flipkart Festival Sale)ను నిర్వహించనుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Big Billion Days Sale)కు ముందే.. కంపెనీ కొన్ని ఆకర్షణీయమైన ఆపిల్ ఐఫోన్ డీల్స్ వెల్లడించింది. అందులో ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 12 మినీ (iPhone 12 mini), ఐఫోన్ 11 (iPhone 11) లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఇంతకీ ఈ పండగ ఆఫర్‭లో ఐఫోన్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

ఐఫోన్లపై భారీగా ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించిన ఫ్లిప్‭కార్ట్.. ధరలపై మాత్రం అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే కొన్ని అంచనాలు, కొన్ని లీకుల నేపథ్యంలో ధరలు ఈ విధంగా ఉండొచ్చనే చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‭లో కేవలం 13,000 రూపాయలకే ఐఫోన్ 11 విక్రయానికి ఉండబోతోందట. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 45,000 పైగానే ఉంది. ఇక 50,000లకు అటు ఇటుగా ఉన్న ఐఫోన్ 12 మినీ కనిష్టంగా 23,000 రూపాయల వరకు దొరకొచ్చని చెబుతున్నారు. అయితే 29,000 నుంచి 39,000 మధ్య ఉండనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఐఫోన్ 13 ధరను 49,999 రూపాయలకు తగ్గించనున్నారట. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 70,000 రూపాయలకు పైగానే ఉంది.

కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్‌లు కాకుండా బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల ఆధారంగా ఆఫర్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సేల్ ఈవెంట్‌ దగ్గరలో ఉంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదని గుర్తించుకోండి. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్ కోసం మీరు సపరేటుగా ఛార్జర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది మీకు అదనపు ఖర్చు అన్నమాటే.

BiggBoss 6 Day 11: ఏడుపులు, ఎమోషనల్స్ తో నిండిపోయిన బిగ్‌బాస్.. వీళ్ళ కథలు వింటే మీరు కూడా ఏడవాల్సింది..