Bank Of Baroda Increase Interest Rates : బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంపు

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) కస్టమర్లకు గుడు న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే వారికి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా తీపి క‌బురు అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై ఈ వ‌డ్డీరేట్లు పెరిగాయి. వివిధ ర‌కాల టెన్యూర్‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 20 బేసిక్ పాయింట్లు (0.20 శాతం) వ‌డ్డీరేట్లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Bank Of Baroda Increase Interest Rates : బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంపు

Bank Of Baroda Increase Interest Rates

Bank Of Baroda Increase Interest Rates : బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) కస్టమర్లకు గుడు న్యూస్. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే వారికి బ్యాంక్ ఆఫ్ బ‌రోడా తీపి క‌బురు అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై ఈ వ‌డ్డీరేట్లు పెరిగాయి. వివిధ ర‌కాల టెన్యూర్‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 20 బేసిక్ పాయింట్లు (0.20 శాతం) వ‌డ్డీరేట్లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నెల 13 నుంచి పెంచిన వ‌డ్డీరేట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఏడాది గ‌డువు గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఎన్నార్వో (నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ) ట‌ర్మ్ డిపాజిట్‌పై 5.30 నుంచి 5.50 శాతానికి పెరిగింది.

400 రోజుల నుంచి మూడేళ్ల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.45 నుంచి 5.50 శాతానికి పెంచింది. మూడేళ్ల నుంచి ప‌దేళ్ల లోపు గ‌డువు గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేటు 5.65 శాతానికి పెరిగింది. ఏడాది గ‌డువు గ‌ల సీనియ‌ర్ సిటిజ‌న్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అధికంగా 5.80 నుంచి 6 శాతానికి పెరిగింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల ఇత‌ర టెన్యూర్‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.95-6.50 నుంచి 6-6.65 శాతానికి వ‌డ్డీరేట్లు పెంచింది.

SBI Users : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!

బరోడా టాక్స్ సేవింగ్స్ ట‌ర్మ్ డిపాజిట్‌ ప‌థ‌కంలో ఖ‌తాదారులు చేసే డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్లు పెంచింది. ఈ ప‌థ‌కం కింద 5 నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ల‌పై 0.15 శాతం పెంపుతో 5.65 శాతానికి చేరింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల డిపాజిట్ల‌పై 6.65 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేసింది. బ‌రోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కం కింద రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.2 కోట్ల లోపు దేశీయుల డిపాజిట్లు, ఎన్నార్వో అండ్ ఎన్ఆర్ఈ ఖాతాదారులకు 5.65 నుంచి 5.80 శాతానికి వ‌డ్డీ పెంచింది.

బ‌రోడా తిరంగా డిపాజిట్ స్కీమ్ కింద 444 రోజులు గ‌డువు గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ 5.75, 555 రోజుల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ప‌థ‌కం వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అద‌నంగా 0.50 శాతం, నాన్‌కాల‌బుల్ డిపాజిట్ల‌పై అద‌నంగా 0.15 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది.