Ghee Protects Against Viruses : చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరస్ ల నుండి రక్షణ కలిగించే నెయ్యి!

చలికాలం శరీరంలోని అదనపు కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటి. ఇందులో బ్యుటిరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీనిని పెద్ద పేగుకణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి. నెయ్యిలో శరీరానికి అవసరమైన ద్రవపదార్ధాలు డి,కె,ఇ,ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Ghee Protects Against Viruses : చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరస్ ల నుండి రక్షణ కలిగించే నెయ్యి!

Ghee protects against viruses like cold, cough and flu in winter!

Ghee Protects Against Viruses : శీతాకాలం ఆరోగ్యానికి ఓ సవాల్ లాంటిది. జలుబు, చర్మ సమస్యలు, దగ్గు వంటి అనారోగ్యాలు వస్తుంటాయి. ఫేస్ చేయాల్సిందే. అయితే.. చలికాలంలో వ్యాధులను అదుపు చేయాలంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నెయ్యి వాడితే వెయ్యి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం. భారతీయ పురాణాలు, సంప్రదాయాలు ఎప్పటి నుంచో నెయ్యి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ఆయుర్వేద చికిత్స నిపుణులు నెయ్యిని సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్‌గా అభివర్ణించారు. నెయ్యిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అత్యుత్తమని చెబుతుండగా చలికాలంలో దీని వినియోగం అనే రుగ్మతల నుండి మనల్ని కాపాడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో నెయ్యి వాడకం వల్ల ఉపయోగాలు ;

నెయ్యిలో ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్‌పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందులోనూ దేశీ నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో వైరస్‌లను అడ్డుకుని ఫ్లూ, దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది. ఉదయం పూట పరిగడుపున ఆహారంలో నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి, శరీరానికి చాలా మంచిది.

చలికాలం శరీరంలోని అదనపు కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటి. ఇందులో బ్యుటిరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీనిని పెద్ద పేగుకణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి. నెయ్యిలో శరీరానికి అవసరమైన ద్రవపదార్ధాలు డి,కె,ఇ,ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలోని యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు చర్మంలోని సున్నితత్వాన్ని పరిరక్షిస్తాయి. చలికాలంలో గుండె పనితీరు, కంటిచూపును మెరుగుపరచి, క్యాన్సర్, మలబద్దక నివారిణిగా ఉపకరిస్తుంది.

దగ్గు, జలుబు, తలనొప్పి వంటి శీతాకాల సమస్యలను తగ్గించేందుకు చేసే న్యాసా చికిత్సలో గోరు వెచ్చని నెయ్యిని వినియోగిస్తారు. చర్మాన్ని దెబ్బ తీసే పిగ్మంటేషన్‌ ను, ఇన్‌ఫ్లమేషన్‌ ను ఇందులోని యాంటీ ఇన్ ఫ్లేమేటరీ గుణాలు దూరం చేస్తాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. శీతాకాలంలో నెయ్యిని శరీరానికి అప్లై చేసుకోవడం వల్ల సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చలికాలంలో నెయ్యి వాడటం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.