Erranalli Methods : వంగలో ఎర్రనల్లి ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Erranalli Methods : వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.
![Erranalli Methods : వంగలో ఎర్రనల్లి ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు Erranalli Methods : వంగలో ఎర్రనల్లి ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు](https://10tv.in/wp-content/uploads/2024/07/Methods-to-Erranalli-in-Brinjal.jpg)
Methods to Erranalli in Brinjal
Erranalli Methods : తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ వుంది. 6 నెలలు కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా వుంది. వీటి తాకిడితో 30 నుండి 50 శాతం వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. అయితే బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువగా వుంది. ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు