Jio Annual Prepaid Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? జియోలో అదిరిపోయే ప్లాన్లు ఇవే.. అన్లిమిటెడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio Annual Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. ప్రతి నెలా లేదా ప్రతి కొన్ని నెలలకోసారి రీఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా? ఒకవేళ మీరు ఏదైనా నెలలో రీఛార్జ్ చేయడం మర్చిపోతే.. మీరు అవుట్గోయింగ్ కాల్లు, మెసేజ్‌లు చేయలేరు.
Jio Annual Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. ప్రతి నెలా లేదా ప్రతి కొన్ని నెలలకోసారి రీఛార్జ్ చేయడం ఇబ్బందిగా ఫీలవుతున్నారా? ఒకవేళ మీరు ఏదైనా నెలలో రీఛార్జ్ చేయడం మర్చిపోతే.. మీరు అవుట్గోయింగ్ కాల్లు, మెసేజ్‌లు చేయలేరు. చాలామంది యూజర్లు తమ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మీ ప్యాక్ వ్యాలిడిటీ ముగిసిపోతుందంటూ రిమైండర్లను పంపిస్తుంటాయి. ఇప్పటికీ నెలవారీ రీఛార్జ్‌లను ట్రాక్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తమ యూజర్లకు రిలయన్స్ జియో (Reliance Jio) వార్షిక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్లు నెలవారీ రీఛార్జ్‌లను తగ్గించడమే కాకుండా ఫోన్ కాలింగ్, డేటా వ్యాలిడిటీపై మంచి డీల్, బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. అదనంగా, జియో యూజర్ల భవిష్యత్తులో టారిఫ్ పెంపుపై కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
రిలయన్స్ జియో ద్వారా వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు (Jio Annual Prepaid Plans), దీర్ఘకాలిక ప్లాన్లను కోరుకునే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. ఈ ప్లాన్లతో ఫ్రీగా OTT సభ్యత్వాలు, Jio యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. మరిన్ని వంటి అదనపు బెనిఫిట్స్ కూడా వస్తాయి. మీరు అన్లిమిటెడ్ రోజువారీ డేటా, వాయిస్, SMS యాడ్-ఆన్ బెనిఫిట్స్ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? ఈ ప్లాన్లు మీ కోసమే అని చెప్పవచ్చు. ఒక ఏడాది ప్యాక్ వ్యాలిడిటీతో జియో ప్రీపెయిడ్ ప్లాన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం.
Jio Annual Prepaid Plans :
Jio Rs 2545 Plan : ఈ ప్యాకేజీలో 336 రోజుల వ్యాలిడిటీతో 1.5 GB రోజువారీ డేటా క్యాప్‌తో 504 GB డేటా ఉంటుంది. రోజువారీ లిమిట్ దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అదనంగా, ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ 100 SMS, అన్లిమిటెడ్ వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఈ ప్యాక్ JioTV, JioCinema, JioSecurity, JioCloudకి ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
Jio Rs 2879 Plan : జియో యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో 2GB రోజువారీ డేటా లిమిట్ పొందవచ్చు. ఈ ప్యాక్ యాడ్-ఆన్ బెనిఫిట్స్, JioTV, JioCinema, JioSecurity, JioCloudకి ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.
Jio Rs 2999 Plan : ఈ జియో సెలబ్రేషన్ ప్లాన్ 365 రోజుల పాటు 2.5GB రోజువారీ లిమిట్‌తో 912.5GB అందిస్తుంది. జియో యూజర్లు JioTV, JioCinema, JioSecurity, JioCloud బెనిఫిట్స్‌తో పాటుగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS, 75GB అదనపు డేటాను పొందవచ్చు. అదనంగా, ప్యాక్ సెలబ్రేషన్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
Zoomin నుంచి రూ. 299 విలువైన Goddiee పొందవచ్చు. Ferns & Petals నుంచి రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు పొందవచ్చు. Ixigo నుంచి రూ. 750, రూ. 4500 అంతకంటే ఎక్కువ విమాన బుకింగ్‌లపై ఫ్లాట్ ఆఫ్ పొందవచ్చు.
ఎంచుకున్న ఉత్పత్తులపై Ajio నుంచి రూ. 2999 & అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఫ్లాట్ రూ. 750 తగ్గింపు పొందవచ్చు. రూ. 1,000 విలువైన కూపన్లు కూడా పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..