Sukumar : దిల్ రాజు నన్ను చాలా సార్లు కొట్టాడు.. ఇప్పటికి నా చెయ్యి పనిచేయట్లేదు.. మూడు రోజులు మాట్లాడలేదు..

ఆర్య సినిమా జర్నీలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట.

Sukumar : దిల్ రాజు నన్ను చాలా సార్లు కొట్టాడు.. ఇప్పటికి నా చెయ్యి పనిచేయట్లేదు.. మూడు రోజులు మాట్లాడలేదు..

Sukumar says about his Issues with Dil Raju in Arya Movie time

Sukumar : అల్లు అర్జున్(Allu Arjun) ఆర్య(Arya) సినిమా రిలీజయి 20 ఏళ్ళు అయిన సందర్భంగా మూవీ యూనిట్ ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ ఆర్య మూవీ లో పనిచేసిన వాళ్లంతా వచ్చి సందడి చేసారు. అందరూ ఆర్య సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.

సుకుమార్ దిల్ సినిమాకు వినాయక్ దగ్గర పనిచేసాడు. దిల్ నిర్మాత దిల్ రాజుకి అప్పుడు ఓ లైన్ చెప్తే బాగా నచ్చడంతో దిల్ హిట్ కొడితే నీకు సినిమా ఇస్తా అని చెప్పాడు. చెప్పినట్టే దిల్ హిట్ అవ్వగానే సుకుమార్ కి సినిమా ఇచ్చారు. అయితే సినిమా జర్నీలో దిల్ రాజు, సుకుమార్ చాలా సార్లు గొడవ పడ్డారట. ఒకరిపై ఒకరు కోపాలు, అరవడాలు, అలగడాలు.. ఇలా చాలా జరిగాయట, ఒక సారి అయితే మూడు రోజుల దాకా మాట్లాడుకోలేదట ఇద్దరూ. ఈ విషయాన్ని దిల్ రాజు, సుకుమార్ ఆర్య 20 ఏళ్ళ వేడుకలో తెలిపారు. సుకుమార్ మరో సంఘటన గురించి కూడా చెప్పారు.

Also Read : Allu Arjun : నా జీవితాన్ని మార్చాడు.. 40 ఏళ్ళ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో ఉండేది సుక్కునే..

సుకుమార్ మాట్లాడుతూ.. అప్పట్లో రీల్ తో షూట్ చేసేవాళ్ళం. రీల్ ఎక్కువైతే ఖర్చు పెరిగిపోయేది. రాజు గారు అప్పుడికి ఒక్క సినిమానే తీసింది. అందుకే అన్ని చోట్ల కాస్ట్ కటింగ్ చూసేవాళ్ళు. నిర్మాతగా బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేసే వాళ్ళు. దీంతో 100 రీల్స్ అయిన ప్రతిసారి నన్ను కొట్టేవాళ్ళు. సడెన్ గా వచ్చి చేయి పట్టుకొని వెనక్కి తిప్పి వీపు మీద దబ దబ కొట్టేవాళ్ళు. అలా చాలా సార్లు చెయ్యి వెనక్కి తిప్పి పట్టుకునేవాళ్ళు. దాని వల్ల నాకు చెయ్యి నొప్పి బాగా వచ్చేది. ఇప్పటికి నేను పుషప్స్ చేయలేను దాని వల్లే అంటూ తెలిపారు. ఇదంతా సరదాగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడారు. అయితే ఇదే ఈవెంట్లో సుకుమార్ రాగానే దిల్ రాజు అలాగే చేయి వెనక్కి తిప్పి వీపు మీద కొట్టడం గమనార్హం.