Bhootham Praytham : ‘భూతం ప్రేతం’ ఫస్ట్ లుక్ రిలీజ్.. పటాస్ బ్యాచ్ మెయిన్ లీడ్స్ లో..
తాజాగా భూతం ప్రేతం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. (Bhootham Praytham)

Bhootham Praytham
Bhootham Praytham : సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.వెంకటేశ్వర రావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భూతం ప్రేతం’. పటాస్ కామెడీ షో తో ఫేమ్ తెచ్చుకున్న యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా భూతం ప్రేతం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. భూతం ప్రేతం ఫస్ట్ లుక్ బాగుంది. యాదమ్మ రాజు, భాస్కర్.. వీళ్లంతా నా టీం. వీళ్ళ కోసమే నేను లాంఛ్ చేశాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని అన్నారు.
Also Read : OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..
ఇక ఈ టైటిల్, పోస్టర్ చూస్తుంటే హారర్ కామెడీ అని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.