Asia Cup 2025: హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..

Courtesy @BCCI
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 37 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మరో ఎండ్ లో గిల్ 29 రన్స్ తో రాణించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడారు. ఒకానొక దశలో స్కోర్ 200 దాటేలా అనిపించింది. అయితే వీరిద్దరూ ఔటయ్యాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
తర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో రన్స్ వేగం తగ్గింది. చివరలో హార్ధిక్ పాండ్య ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లో 38 రన్స్ స్కోర్ చేశాడు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేస్ 2 వికెట్లు తీశాడు. సకీబ్, రెహ్మాన్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టార్గెట్ 169 పరుగులు.