New Aadhaar App : కొత్త ఇ-ఆధార్ యాప్ వస్తోంది.. ఇకపై ఇంట్లో నుంచే అన్ని మీ ఫోన్‌లో అప్‌డేట్ చేయొచ్చు.. ఆ ఒక్కటి తప్ప..!
New Aadhaar App : యూఐడీఏఐ నుంచి సరికొత్త మొబైల్ ఇ-ఆధార్ యాప్ రాబోతుంది. అతి త్వరలో అందరికి అందుబాటులోకి రానుంది. ఏయే సర్వీసులు పొందొచ్చంటే?

New Aadhaar App : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో కొత్త ఆధార్ యాప్ రాబోతుంది. ఇకపై దాదాపు ఆధార్ ఆధారిత అన్ని పనులు మీ ఫోన్‌లోనే పూర్తి చేయొచ్చు. ప్రత్యేకించి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన పని అంతకన్నా ఉండదు. ఇ-ఆధార్ యాప్ ద్వారా మీ ఇంటి నుంచే ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

మీ పేరులోని చిన్న అక్షర దోషాన్ని కరెక్షన్ చేయడం లేదా మీ అడ్రస్ అప్‌డేట్ చేసేందుకు ఆధార్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మీ ఫోన్ నుంచి మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలను మీకు మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సరికొత్త మొబైల్ అప్లికేషన్‌పై యూఐడీఏఐ పనిచేస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ యాప్ అందుబాటులోకి రానుంది.

ఇ-ఆధార్ అంటే ఏంటి? : ఇ-ఆధార్ అనేది ఒక డిజిటల్ ఆధార్ సెంటర్.. రాబోయే ఇ-ఆధార్ యాప్‌తో మీ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే మీ కీలక ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఫేస్ ఐడీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తుంది. తద్వారా ఆధార్ అప్‌డేట్స్ ఈజీగా సేఫ్‌గా ఉండేలా చేస్తుంది. ఈ నవంబర్ నుంచి మీరు ఆధార్ ఎన్‌రోల్ సెంటర్‌కు ఫిజికల్‌గా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకే సమయంలో బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫింగర్ ఫ్రింట్ లేదా ఐరిస్ స్కాన్‌లు, మీ పేరులో తప్పులు సరిదిద్దడం, అడ్రస్ మార్చడం వరకు అన్ని పూర్తి చేయవచ్చు.

మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలంటే : ఇ-ఆధార్ యాప్ ద్వారా మొబైల్ అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు. మీరు ఇప్పటికీ ఆధార్ సెంటర్ సందర్శించాలి. ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసేందుకు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.

కరెక్షన్ ఫారమ్‌ను నింపండి. మీ బయోమెట్రిక్‌లను అందించి ఆపై వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫై తర్వాత మీ కొత్త నంబర్ కొన్ని రోజుల్లోనే ఆధార్ కార్డుకు లింక్ అవుతుంది.

యూఐడీఏఐ కొత్త యాప్ దాదాపు రెడీ అయింది. రాబోయే 2 నుంచి 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. యాప్ టెస్టింగ్, డెమో ప్రాసెస్ కూడా పూర్తయింది. ఈ యాప్ mAadhaar యాప్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డిజిటల్ సర్వీసులు మరిం ఈజీగా మారనున్నాయి.

డిజిటల్ ఐడెంటిటీ షేరింగ్, QR కోడ్ వెరిఫికేషన్, మెరుగైన ఇంటర్‌ఫేస్ వంటి కొత్త ఫీచర్లు ఉంటాయి. జాబ్ ఇంటర్వ్యూ అయినా లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అయినా ఐడెంటిటీ ప్రూఫ్ కోసమైనా ఇకపై ఫొటోకాపీలు అవసరం లేదు. యాప్ నుంచి కొన్ని క్లిక్‌లతో సమాచారమంతా పంపవచ్చు.

ఆధార్ యాప్‌లో ఏయే సౌకర్యాలంటే? : ఇప్పటివరకు ఆధార్ కార్డు ఫొటోకాపీని అందించాల్సి వచ్చేది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ ఐడెంటిటీ డేటాను డిజిటల్‌గా షేర్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. వినియోగదారులు ఏ డేటాను షేర్ చేయాలో యాప్ ద్వారా నిర్ణయించుకోవచ్చు. తద్వారా డేటా ప్రైవసీని అందిస్తుంది. డాక్యుమెంట్ల ఇబ్బందిని ఉండదు. ఫేక్ ఆధార్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు యూఐడీఏఐ కృషి చేస్తోంది.

మీరు ఇప్పుడు కొత్త ఆధార్ యాప్‌తో ఏదైనా ఆధార్ కార్డ్ QR కోడ్‌ను స్కాన్ చేసి వ్యాలిడిటీని ధృవీకరించవచ్చు. ప్రతి ఆధార్ కార్డ్‌లో QR కోడ్ ఉంటుంది. యూఐడీఏఐ యాప్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆధార్ కార్డ్ ఫేక్ లేదా ఒరిజినల్ అనేది తెలుసుకోవచ్చు.