Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి!

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ అభిమానుల కోసం అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సందర్భంగా ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అన్ని బ్యాంక్ ఆఫర్లతో ఇప్పుడు అమెజాన్‌లో రూ.1,04,000 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మంచి కెమెరా, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, డిజైన్‌తో కూడిన ఆల్‌రౌండ్ డివైస్‌ను ఎంచుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ఫోన్ కోసం చూస్తుంటే.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఈ డీల్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
2/6Samsung Galaxy S25 Ultra 5G
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర : అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సందర్భంగా టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ ఆప్షన్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (12GB RAM + 256GB స్టోరేజ్) ప్రస్తుతం రూ.1,04,180 ధరకు అందుబాటులో ఉంది. దాదాపు రూ.25వేలు తగ్గింపు ధరకే లభిస్తోంది.
3/6Samsung Galaxy S25 Ultra 5G
ఆసక్తిగల కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లతో రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ.1,03,000 కన్నా తగ్గుతుంది. కస్టమర్లు నెలకు రూ.4,691 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
4/6Samsung Galaxy S25 Ultra 5G
కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఆ ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్ ఆధారంగా రూ.50,950 వరకు పొందవచ్చు. కస్టమర్లు ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
5/6Samsung Galaxy S25 Ultra 5G
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : లేటెస్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల అమోల్డ స్క్రీన్‌ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుంది. 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ IP68 సర్టిఫికేట్ పొందింది.
6/6Samsung Galaxy S25 Ultra 5G
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.