Jagan Digital Book: అప్పుడు లోకేశ్ రెడ్ బుక్, ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్..! ఈ రివేంజ్ గేమ్ ఆగేదెప్పుడు..?
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్‌ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

Jagan Digital Book: పవర్ ఈజ్ ఆల్ వేస్ పవర్ ఫుల్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లదే పైచేయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా తాము బాధితుల్లాగా..అణిచివేతకు గురవుతున్నట్లుగా చెప్తుంటాయి. పైగా అపోజిషన్‌లో ఉన్నప్పుడు క్యాడర్‌కు ధైర్యం నూరిపోసేందుకు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం కూడా ఓ స్ట్రాటజీ అయిపోయింది. అరెస్టులు, కేసులు, అంటూ అప్పుడు లోకేశ్ రెడ్‌బుక్ తీసుకొస్తే..ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఈ రివేంజ్ బుక్‌లు ఎవరి కోసం? అప్పుడు లోకేశ్ వార్ ఎవరి మీద..? ఇప్పుడు జగన్ ఎవర్ని టార్గెట్ చేస్తున్నట్లు.? ప్రతిపక్షంలో ఉంటే బాధితులు..పవర్‌లో ఉంటే రివేంజ్ గేమ్ ఎందుకు?
అధికార పార్టీ అప్పర్ హ్యాండ్. ఇదే బాటమ్ లైన్. పాలిటిక్స్ అంటేనే అలా ఉంటాయి. ఆటోమేటిక్‌గా ప్రతిపక్ష పార్టీ తాము బాధితులమని..తమ క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్నారని ఇష్యూ చేయడం కొత్తేమి కాదు. ఎవరు అధికారంలో ఉన్నా..మరెవరు ప్రతిపక్షంలో ఉన్నా..రోల్స్ మారుతున్నాయే కానీ..తీరు మారడం లేదన్న చర్చ జరుగుతోంది.
అప్పుడు టీడీపీ రెడ్ బుక్, ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్..
పవర్‌లో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్. వన్స్ అపోజిషన్‌లోకి వచ్చేసరికి వై దిస్ అంటూ పార్టీలు టోన్ మార్చేయడం ట్రెండ్ అయిపోయింది. ఈ క్రమంలోనే అప్పుడు టీడీపీ రెడ్‌బుక్ తెస్తే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ అంటున్నారు. అధికారంలోకి రాగానే, బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టమని జగన్ చాలా ధీమాగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని..ఎక్కడున్నా పిలిపిస్తాం..చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్‌లు ఇస్తున్నారు.
రెడ్ బుక్‌కు పోటీగానే జగన్ డిజిటల్ బుక్ తెచ్చారన్నది ఓపెన్ సీక్రెట్. అసలు ఈ బుక్‌లు ఏంటి..ఈ రివేంజ్‌లు ఎందుకన్నదే ఇప్పుడు బిగ్ డిబేట్‌గా మారింది. టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు లోకేశ్ రెడ్‌బుక్ అంటూ హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడది ఇంప్లిమెంట్ అవుతూ వస్తోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. అసలు రెడ్‌బుక్ ఎలా పుట్టిందని అడిగితే..వైసీపీ హయాంలో అణిచివేతలు..వేధింపులు వల్లే అంటోంది టీడీపీ.
ఈ రివేంజ్ బుక్‌లు ఎందుకు..ఎవరి కోసం?
ఇప్పుడు వైసీపీ చెప్తున్న సమాధానం కూడా అదే. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని..పోలీసులు వేధిస్తున్నారని..అందరి పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చాక లెక్కకు లెక్క సరి చేస్తామంటున్నారు. ఇదంతా బానే ఉన్నా..క్యాడర్, లీడర్లకు భరోసా కల్పించేందుకే..ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నా..ఈ రివేంజ్ బుక్‌లు ఎందుకు..ఎవరి కోసం అనేది హాట్ టాపిక్‌గా మారింది.
అప్పుడు టీడీపీ రెడ్‌బుక్ అంటే..ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ తెచ్చామంటోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్‌ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి
ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా..మంచి చేసేందుకే. కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు కానే కాదని ప్రతీ పార్టీ తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమ లీడర్లను, క్యాడర్‌ను..లాస్ట్‌కు చంద్రబాబును ఆయన ఫ్యామిలీని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు విపక్షంలో ఉండేసారికి జగన్‌కు అరాచకం, అన్యాయం వంటి పదాల విలువ తెలిసి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.
ఐదేళ్లు పవర్‌లో ఉన్నప్పుడు అరాచకం చేసి అపోజిషన్‌లోకి వచ్చేసరికి నీతులు చెప్తున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్ డిజిటల్ బుక్ ప్రస్తావన..టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా..ఎవరు అధికారంలో ఉన్నప్పటికి ఓ లిమిట్‌లో ఉండటం చాలా ఇంపార్టెంట్. అయితే రెడ్‌బుక్, డిజిటల్ బుక్ అసలు ఉద్దేశమేంటన్నది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీల పవర్ పాలిటిక్స్‌లో అధికారులు బలి అవుతున్నారన్న చర్చ లేకపోలేదు.
ఎవరు పవర్‌లో ఉంటే వాళ్ల డైరెక్షన్ లో అధికార యంత్రాంగం పని చేస్తుంటుంది. అలా అని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు రివేంజ్ గేమ్ ఆడుకుంటూ పోతే..పాలన సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు టీడీపీ లీడర్లను వైసీసీ టార్గెట్ చేస్తే..ఇప్పుడు వైసీపీ లీడర్లను కూటమి కార్నర్ చేస్తుందనుకున్నా..ఎవరో ఒకరు ఈ రివేంజ్ పాలిటిక్స్‌కు బ్రేకులు వేయాల్సిందేనన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.
ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే..ఇది ఎప్పుడు ఆగేదన్న టాక్ వినిపిస్తోంది. లీడర్లు కూడా పవర్‌లో ఉన్నప్పుడు ఒకలా..అధికారం కోల్పోయాక మరోలా బిహేవ్ చేయడం, మాట్లాడటం కూడా మానుకుంటే రివేంజ్ డ్రామా ఆగి..డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయొచ్చని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
Also Read: కూటమి వర్సెస్ వైసీపీ.. ఎవరిది పైచేయి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నట్లు?