AP Politics: కూటమి వర్సెస్ వైసీపీ.. ఎవరిది పైచేయి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నట్లు?

వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. నలుగురైదుగురు నేతలు తప్ప..మిగతా నేతలెవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు.

AP Politics: కూటమి వర్సెస్ వైసీపీ.. ఎవరిది పైచేయి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నట్లు?

Updated On : September 23, 2025 / 8:37 PM IST

AP Politics: పీక్ లెవల్‌ హీట్. ప్రతీ రోజు క్లైమాక్స్‌ను మించిన డైలాగ్‌ వార్. రోజుకో అప్డేట్. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. ఏడాదిగా ఏపీ పాలిటిక్స్‌ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఓటమి నుంచి వైసీపీ ఇంకా పూర్తిగా తేరుకోనేలేదు. పార్టీ లీడర్లంతా సైలెంట్‌ అయినా..పలువురు జైలుకు వెళ్లిన..ఆ నలుగురైదుగురు లీడర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ తరఫున అన్నీ తామై వాయిస్‌ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు వేస్తున్న ట్రాప్‌లో ఎవరు పడుతున్నారు? కూటమి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్‌లో ఎవరిది పైచేయి? ఫ్యాన్ పార్టీ లీడర్లు పార్టీని స్ట్రెంత్ చేయడం అటుంచి..సమస్యలు తీసుకొస్తున్నారా?

కూటమి పవర్‌లోకి వచ్చి 15 నెలలు కావొస్తోంది. మొదటి మూడు నాలుగు నెలల మినహా ఆ తర్వాత నుంచి..ఏపీ రాజకీయమంతా రంజుగా నడుస్తోంది. జగన్ పర్యటనలు..ఆ టూర్లలో సెక్యూరిటీ..తొక్కిసలాట అంటూ కొన్నాళ్లు హడావుడి నడిచింది. ఆ తర్వాత రెంటపాళ్ల పర్యటనతో పాలిటిక్స్ట్‌ నెక్స్ట్ లెవల్‌ హీట్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు తగ్గిపోయాయి. లిక్కర్ కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. చివరకు ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అవడం..జగన్ సోదరుడు అనిల్‌రెడ్డి ఇంట్లో సోదాలు వంటివి ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

అయితే వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. నలుగురైదుగురు నేతలు తప్ప..మిగతా నేతలెవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి వంటి నేతలు రెగ్యులర్‌గా మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారు.

ఇరకాటంలో పడిపోవడమే కాదు పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారన్న టాక్..

మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడదల రజిని అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ..కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే తరచుగా ప్రెస్‌మీట్లలో ఫ్యాన్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న నేతలు..కొన్నిసార్లు కొని మరీ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. వాళ్లు ఇరకాటంలో పడిపోవడమే కాదు..పార్టీని చిక్కుల్లోకి నెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

వైసీపీ గొంతుకగా తన వాయిస్ వినిపిస్తుంటారు పేర్నినాని. ఇలాంటి క్రమంలోనే ఆ మధ్య కార్యకర్తల సమావేశంలో పేర్నినాని చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. రప్పా రప్పా ఏంటి..కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలంటూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. కేసులు నమోదు..కోర్టులు, బెయిల్‌ అంటూ కొన్ని రోజులు ఎపిసోడ్‌ నడిచింది. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న టైమ్‌లో లోకేశే ఇదంతా చేశారని ఇరికించాలని పేర్నినాని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు బయటికి వచ్చిన వీడియో..ఫ్యాన్ పార్టీని డైలమాలో పడేసింది. ఇక అంతకుముందు గోడౌన్‌ కేసులో పేర్నినాని కార్నర్ అవడంతో పాటు పార్టీ సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చిందన్న చర్చ కూడా ఉంది.

ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు..వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారితీశాయి. లేటెస్ట్‌గా రాజధాని విషయంలో క్లారిటీ ఇస్తూనే..అమరావతే రాజధాని..కానీ అప్పులు చేసి అక్కడ నిర్మాణాలు చేయడానికి వ్యతిరేకమన్నారు సజ్జల. అంతేకాదు గుంటూరు, విజయవాడ మధ్య మహానగరం అంటూ కొత్త రాగం అందుకోవడంతో కొత్త కన్‌ఫ్యూజన్‌ క్రియేట్ అయి నిరసనలకు దారితీసింది.

కూటమి ట్రాప్ లో పడ్డ భూమన?

ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహతుడు. ఆయన రెగ్యులర్‌గా తిరుపతి సెంట్రిక్‌గా మీడియా సమావేశాలు పెడుతూ అటు టీటీడీ తీరును..ఇటు కూటమి సర్కార్ మీద బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో భూమన కూటమి ట్రాప్‌లో పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. టీడీఆర్ బాండ్ల విషయంలో కూటమి సర్కార్ భూమనను టార్గెట్ చేస్తే.. ఆయన ఐఏఎస్‌ శ్రీలక్ష్మీని వివాదంలోకి లాగి ఇష్యూను కొత్త టర్న్ తీసుకునేలా చేశారు.

భూమనతో పాటు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ కూడా బ్లేమ్‌ అయ్యే ఛాన్స్?
గోశాలలో మూగజీవాలు చనిపోతున్నాయని.. టీటీడీలో పాలన పక్కదారి పట్టిందని అటాక్ చేస్తూ వచ్చిన భూమన..అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యం అంటూ హడావుడి చేశారు. కట్‌ చేస్తే అది భూమన మెడకు చుట్టుకోవడమే కాదు వైసీపీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ ఇష్యూ అలా చల్లారకముందే.. పరకామణి చోరీ వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమన టార్గెట్‌గానే కూటమి అస్త్రాలు బయటికి తీసినా..ఇప్పుడు సిట్‌ విచారణ అంటూ వివాదం పెద్దది అవుతోంది. ఆ కేసు దర్యాప్తు స్టార్ట్ అయితే..భూమనతో పాటు వైవీ సుబ్బారెడ్డి..పైగా వైసీపీ పార్టీ కూడా బ్లేమ్‌ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.

ఇలా ఇష్యూ ఏదైనా ఫ్యాన్ పార్టీ లీడర్లు కొన్నిసార్లు కొని మరీ సమస్య తెచ్చుకోవడమే కాదు..పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారన్న టాక్ విపిపిస్తోంది. పైగా కూటమి ప్రభుత్వ వైఫల్యాల కంటే పాత ఇష్యూల మీదే రచ్చ జరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అధికార కూటమిని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి వైసీపీనే కార్నర్ అవుతుందని..ఈ క్రమంలో కూటమి పెద్దలు వేసే ట్రాప్‌లో ఫ్యాన్ పార్టీ నేతలు పడిపోతున్నారన్న ఒపీనియన్స్‌ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో వైసీపీ నేతలు అలర్ట్ అవుతారో లేదో చూడాలి.

Also Read: కార్యకర్తకు పెద్ద పదవి.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ అదేనా..?