Allu Arjun : నా జీవితాన్ని మార్చాడు.. 40 ఏళ్ళ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో ఉండేది సుక్కునే..

ఆర్య 20 ఏళ్ళ వేడుకలో అల్లు అర్జున్ సుకుమార్ గురించి మాట్లాడుతూ..

Allu Arjun : నా జీవితాన్ని మార్చాడు.. 40 ఏళ్ళ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో ఉండేది సుక్కునే..

Allu Arjun got Emotional while talking about Sukumar in Arya 20 Years Event

Updated On : May 8, 2024 / 8:07 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయి క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్, అను మెహతా జంటగా సుకుమార్(Sukumar) దర్శకత్వలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఆర్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో మూవీ యూనిట్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆర్య మూవీ లో పనిచేసిన వాళ్లంతా వచ్చి సందడి చేసారు.

Also Read : Allu Arjun : ఆ పని చేయకుండా షూటింగ్స్ కి వెళ్ళను.. ఆర్యలో జరిగిన తప్పు మళ్ళీ నా లైఫ్ లో చేయలేదు..

ఆర్య 20 ఏళ్ళ వేడుకలో అల్లు అర్జున్ సుకుమార్ గురించి మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఇంపాక్ట్ చూపించింది, నా లైఫ్ మార్చింది సుకుమార్. ఇంకో 30, 40 ఏళ్ళ తర్వాత కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో సుకుమారే ఉంటాడు. ఆయనంత క్లోజ్ నాకు ఇంక ఎవ్వరూ అవ్వలేదు. మా అసోసియేషన్ నా జీవితాన్ని మార్చింది. గంగోత్రి తర్వాత ఇంజిన్ లేని భోగిలా నేను వెళ్తుంటే ఆర్య సినిమాతో వచ్చి నన్ను లైన్ లో పెట్టాడు. నేను ఇవాళ ఇక్కడ నిల్చున్నాను రెండు కాళ్ళ మీద అంటే అది సుకుమార్ వల్లే. సుకుమార్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. లవ్ యు సుక్కు డార్లింగ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు బన్నీ.