Allu Arjun : ఆ పని చేయకుండా షూటింగ్స్ కి వెళ్ళను.. ఆర్యలో జరిగిన తప్పు మళ్ళీ నా లైఫ్ లో చేయలేదు..

ఆర్య 20 ఏళ్ళ వేడుకలో బన్నీ ఓ ఆసక్తికర సంఘటనని తెలియచేశారు.

Allu Arjun : ఆ పని చేయకుండా షూటింగ్స్ కి వెళ్ళను.. ఆర్యలో జరిగిన తప్పు మళ్ళీ నా లైఫ్ లో చేయలేదు..

Allu Arjun says About his Dedication to Work in Arya 20 Years Event

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన రాబోయే పుష్ప 2 సినిమా కోసం ఇండియా అంతా ఎదురుచూస్తుంది. ఇంత ఎదిగాడంటే ఏ రేంజ్ లో కష్టపడి ఉండాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి. తాజాగా అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు. ఆర్య 20 ఏళ్ళ వేడుకలో బన్నీ ఓ ఆసక్తికర సంఘటనని తెలియచేశారు.

అల్లు అర్జున్, అను మెహతా జంటగా శివ బాలాజీ, రాజన్ దేవ్, సుబ్బరాజ్, సునీల్, వేణు మాధవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో సుకుమార్(Sukumar) డెబ్యూట్ దర్శకత్వలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో తెరకెక్కిన ఆర్య సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 7 మే 2004లో ఆర్య సినిమా రిలీజవ్వగా తాజాగా 20 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో ఇలాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చినందుకు ఆర్య 20 ఏళ్ళ వేడుక చేసి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

Also Read : Arya : ‘ఆర్య’ సినిమాకు అల్లు అర్జున్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆర్య షూటింగ్ టైంలో న్యూ ఇయర్ వచ్చింది. నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. రాత్రంతా పార్టీ చేసుకున్నా. పొద్దున్నే షూటింగ్ ఉందని కాల్ వచ్చింది. తకదిమిథోమ్ సాంగ్ కి స్పెషల్ లొకేషన్స్ వెతుకుతున్నారు. గంగవరం దగ్గర పర్మిషన్ వచ్చింది. దీంతో వెంటనే షూట్ చేయాలి, రమ్మన్నారు. షూటింగ్ కి వెళ్తే ఎండ, నిద్ర లేదు చాలా కష్టపడ్డాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను. షూటింగ్ ఉన్న ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లోని 9 లేదా 10 గంటలకి పడుకోవాలి. కనీసం నేను 8 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేయలేను. అలాగే షూటింగ్ ముందు రోజు పార్టీలు చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యా. ఇవాళ్టి వరకు కూడా మధ్యలో ఎప్పుడో ఒకటి, రెండు సార్లు తప్ప ఆ రూల్ ఇప్పటికి బ్రేక్ చేయలేదు కాబట్టే ఇవాళ ఇలా ఉన్నాను అని చెప్పారు.