న్యూయార్క్‌లో విద్యా సంవత్సరం క్లోజ్ చేసిన ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : April 11, 2020 / 02:56 PM IST
న్యూయార్క్‌లో విద్యా సంవత్సరం క్లోజ్ చేసిన ప్రభుత్వం

అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పాఠశాలలు మూసివేయబడ్డాయి. అయితే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో టీచింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఉండగా.. నగరంలో పేద విద్యార్ధులు ఎక్కువగా ఉండడంతో వారికి వైఫై మరియు వారి వర్చువల్ తరగతి గదులకు కనెక్ట్ అయ్యే పరికరాలు లేవు.

ఈ క్రమంలోనే విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యలో నగరంలో మిగిలిన విద్యా సంవత్సరాన్ని తీసివేస్తున్నట్లు మేయర్ బిల్ డి బ్లాసియో ప్రకటించారు.

మార్చి 16వ తేదీ నుంచి న్యూయార్క్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడగా.. ఆన్‌లైన్‌లో బోధనను తరలించడానికి భారీ ప్రయత్నం చేశారు. అయితే దానికి నగరంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  వర్చువల్ క్లాస్‌లకు కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే మిగిలిన విద్యా సంవత్సరాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.