Car Discounts in March : మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన కారు తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

Car Discounts in March : ఆటోమొబైల్ తయారీ కంపెనీల్లో మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India), హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), టాటా మోటార్స్ (Tata Motors) వంటి కంపెనీలు మార్చిలో తమ కార్లపై కొన్ని భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Car Discounts in March : మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన కారు తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

Car Discounts in March _ Maruti, Hyundai, Tata car discounts in March _ Offers that you should not miss

Car Discounts in March : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. మార్చిలో కొత్త కారు కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమొబైల్ తయారీ కంపెనీల్లో మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India), హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), టాటా మోటార్స్ (Tata Motors) వంటి కంపెనీలు మార్చిలో తమ కార్లపై కొన్ని భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

మారుతి కార్లపై డిస్కౌంట్లు ఇవే :
మార్చిలో మారుతి సుజుకి ఇగ్నిస్ రూ. 52వేల వరకు తగ్గింపులను కలిగి ఉంది. మారుతి సుజుకి సియాజ్‌పై రూ. 28వేల వరకు తగ్గింపులు ఉన్నాయి. మారుతి సుజుకి ఆల్టో (Alto)పై రూ. 38వేల వరకు అందిస్తుంది. మారుతి సుజుకి Alto K10, మారుతి సుజుకి S-ప్రెస్సోపై రూ. 49వేల వరకు అందిస్తుంది.

Read Also : Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా CNG మోడల్ కారు లాంచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

మారుతి సుజుకి వ్యాగన్(R) రూ. 64వేల వరకు, మారుతి సుజుకి రూ. 44వేల వరకు తగ్గింపులు అందిస్తోంది. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) రూ. 54వేల వరకు అందిస్తోంది. మారుతి సుజుకి డిజైర్ రూ. 10వేల వరకు అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదని గమనించాలి.

Car Discounts in March _ Maruti, Hyundai, Tata car discounts in March _ Offers that you should not miss

Car Discounts in March _ Maruti, Hyundai, Tata car discounts in March

హ్యుందాయ్ (Hyundai) కార్లపై డిస్కౌంట్లు :
మార్చిలో గ్రాండ్ i10 నియోస్, i20, ఆరా (Aura) వంటి మోడళ్లపై హ్యుందాయ్ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ రూ. 38వేల వరకు తగ్గింపులను కలిగి ఉంది. ప్రముఖ హ్యుందాయ్ i20పై రూ.20వేలు, హ్యుందాయ్ (Aura)పై రూ.33వేల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, క్రెటా (Creta), వెన్యూ (Venue), అల్కాజార్ (Alcazar) టక్సన్ (Tucson) వంటి SUV మోడళ్లకు ఎలాంటి తగ్గింపు లేదు.

టాటా (Tata) కార్లపై డిస్కౌంట్లు :
టాటా మోటార్స్ అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనం (PV), టాటా నెక్సాన్ మార్చిలో రూ. 3వేల కార్పొరేట్ తగ్గింపును కలిగి ఉంది. టాటా హారియర్ (Tata Harrier) టాటా సఫారిపై రూ.45వేల వరకు తగ్గింపు ఉంది. టాటా టియాగో (Tata Tiago)పై రూ. 28వేల వరకు, టాటా టిగోర్‌ (Tata Tigor)పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది. టాటా ఆల్ట్రోజ్ రూ. 28వేల వరకు తగ్గింపులను అందిస్తోంది.

Read Also : iQOO Z7 5G Launch : ఐక్యూ Z7 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. కళ్లు చెదిరే ఫీచర్లు, రూ.17,499కే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే!