Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా CNG మోడల్ కారు లాంచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Brezza : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki Brezza) నుంచి దేశ మార్కెట్లో బ్రెజ్జా CNGని రూ.9.14 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.

Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా CNG మోడల్ కారు లాంచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Brezza CNG launched in India, price starts at Rs 9.14 lakh

Maruti Suzuki Brezza : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki Brezza) నుంచి దేశ మార్కెట్లో బ్రెజ్జా CNGని రూ.9.14 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 12.05 లక్షల వరకు ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ లోనే అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా CNG అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 15వ CNG మోడల్ అని చెప్పవచ్చు. Alto, Alto K10, S-Presso, Celerio, Eeco, WagonR, Swift, Dzire, Ertiga, Baleno, XL6, Grand Vitara, Tour S, సూపర్ క్యారీ వంటి మరెన్నో మోడళ్లు ఉన్నాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా CNG వేరియంట్‌లు ఇవే :
Brezza CNG కారు మోడల్ (LXi, VXi ZXi) మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Maruti Discount Offers : ఈ మార్చిలో మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. మీకు నచ్చిన కారును ఇప్పుడే బుక్ చేసుకోండి!

మారుతి సుజుకి బ్రెజ్జా CNG ధరలివే :
బ్రెజ్జా CNG ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
బ్రెజ్జా LXi CNG – రూ. 9.14 లక్షలు
బ్రెజ్జా VXi CNG – రూ. 10.49 లక్షలు
బ్రెజ్జా ZXi CNG – రూ. 11.89 లక్షలు
బ్రెజ్జా ZXi CNG డ్యూయల్ టోన్ – రూ. 12.05 లక్షలు

Maruti Suzuki Brezza CNG launched in India, price starts at Rs 9.14 lakh

Maruti Suzuki Brezza CNG launched in India, price starts at Rs 9.14 lakh

మారుతి సుజుకి బ్రెజ్జా CNG మైలేజ్ ఎంతంటే? :
మారుతి సుజుకి (Brezza) CNG మోడల్ K-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. CNG మోడ్‌లో 89PS గరిష్ట శక్తితో పాటు 121Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 101PS గరిష్ట శక్తితో పాటు 136Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. బ్రెజ్జా CNG మైలేజ్ 25.51km/kg వరకు అందిస్తుంది.

సుజుకి బ్రెజ్జా CNG ఫీచర్లు ఇవే :
ఫీచర్ల విషయానికొస్తే.. బ్రెజ్జా CNG LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ Apple CarPlay, Android Autoతో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ పుష్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇంటిగ్రేటెడ్ పెట్రోల్, CNG ఫ్యూయల్ గాగేజ్, CNG డ్రైవ్ మోడ్, డిజిటల్, అనలాగ్ CNG ఫ్యూయల్ గేజ్‌లు, ఇల్యూమినేటెడ్ ఫ్యూయల్ చేంజ్-ఓవర్ స్విచ్ వంటి కస్టమైజడ్ CNG-నిర్దిష్ట ఫీచర్లు ఉన్నాయి.

ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన SUV ఇదే :
టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లను అధిగమించి ఫిబ్రవరిలో 15,787 యూనిట్లకు మారుతి సుజుకి బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది.

Read Also : Maruti Suzuki Car Discounts : మార్చిలో మారుతి సుజుకి మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ కారు ధర ఎంతంటే?