30 ఏళ్ల సెల్యులాయిడ్ సెన్సేషన్ ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’..

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ తెరకెక్కించిన

30 ఏళ్ల సెల్యులాయిడ్ సెన్సేషన్ ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’..

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ తెరకెక్కించిన సెల్యులాయిడ్ సెన్సేషన్.. ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’.. 1990 మే 9వ తేదిన విడుదలైన ఈ చిత్రం 2020 మే 9 నాటికి విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. చిరు, శ్రీదేవిల నటన, కెమిస్ట్రీ, చిరు డ్యాన్స్ మూమెంట్స్ ఎవర్ గ్రీన్.

Chiranjeevi

సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్‌నీ మ్యాజిక‌ల్‌గా చూపించారు  డీఓపీ విన్సెంట్.. అంద‌మైన సెట్స్‌తో మైమ‌ర‌పింప‌జేసిన ఆర్ట్ డైరెక్ట‌ర్ చ‌లం, ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూప‌ర్‌ టెంపోనిచ్చారు చంటి(కోటగిరి వెంకటేశ్వర రావు) పాట‌లు, మాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేశారు వేటూరి, జంధ్యాల..వీళ్లంద‌రి క‌ష్టానికి ప్రాణం పోశారు ఒక లెజెండ్‌.. ఒకే ఒక్క మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపించింది. అప్పటి తుఫాను ధాటికి తట్టుకుని మరీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించింది.

Jagadeka Veerudu Athiloka Sundari Completed 30 Years

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినీ పరిశ్రమ తెరకెక్కించిన టాప్-25 సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సందరి’కి కచ్చితంగా స్థానముంటుంది. అద్భుతాన్ని మనం ప్లాన్ చేయలేం. అది అలా జరిగిపోతుందంతే. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సమష్టి కృషి ఫలితం. ఈ విజయంలో అందరికీ భాగం ఉంది. ఈ సినిమాకు జనరేషన్ గ్యాప్ లేదు. ఇలాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దొరికినందుకు నేను గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.