మే 9 అందించిన మెమరబుల్ మూవీస్..
మే 9వ తేది దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో విడుదలైన మరపురాని చిత్రాలు..

మే 9వ తేది దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో విడుదలైన మరపురాని చిత్రాలు..
మే 9.. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఈ తేది చాలా ప్రత్యేకమైనది. పలు మరపురాని చిత్రాలనందించిన ఈ డేట్ అంటే సినీ ప్రముఖులకు ఓ సెంటిమెంట్..
అలాగే సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే9. ఈ తేదీకి ఘనమైన సినీ చరిత్రే ఉంది. అసలు ఎందుకు మే 9 వెరీ స్పెషల్? అంటే.. సినీ పంచాంగం ప్రకారం ఈ తేదీన విడుదలైన దాదాపు అన్ని సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అవుతాయి. అయ్యాయి కూడా. అవేంటో చూద్దాం..
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘భారతీయుడు’, ‘ప్రేమించుకుందాం రా’, ‘సంతోషం’, ‘మహానటి’, ‘మహర్షి’ వంటి చిత్రాలు మే9న విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ఏ రేంజ్లో విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ టాలీవుడ్ చరిత్రలోనే సెల్యులాయిడ్ సెన్సేషన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వచ్చి నేటికి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే చూడకుండా ఎవరూ ఉండలేరు.
#TheDayInSPHistory
23 Years ago on this day, @VenkyMama , Anjala Zaveri Starrer Preminchukundam Raa released at the box office and created history at the box office. #23YearsForPreminchukundamRaaJoin the watch party of this movie today at 6 PM here: https://t.co/NEqqWb5cYw pic.twitter.com/jd0y22StlR
— Suresh Productions (@SureshProdns) May 9, 2020
విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమించుకుందాం రా’ది ప్రేమకథా చిత్రాలలో ఓ ప్రత్యేకమైన స్థానం. శంకర్, కమల్ హాసన్ కలయికలో తెరకెక్కిన ‘భారతయుడు’ ఎంతటి సంచలనం సృష్టించాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన ‘సంతోషం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని జాతీయ అవార్డ్ సొంతం చేసుకుంది.
స్నేహం, వ్యవసాయం మరియు రైతుల గొప్పదనం తెలుపుతూ రూపొందిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం గతేడాది మే 9న విడుదలైంది. అలాగే నేటితో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అదృష్టవంతులు’ 40 సంవత్సరాలు (09/05/1980), ఎమోషనల్ ఎంటర్టైనర్.. ‘భోగి మంటలు’ 39 సంవత్సరాలు(09/05/1981), మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ 29 సంవత్సరాలు(09/05/1991) పూర్తి చేసుకోవడం విశేషం.
అంతేకాకుండా ఈ రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, హీరో రానా తమ్ముడు అభిరామ్ తదితరులు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Read More: