వలస కార్మికులపై దూసుకెళ్లిన కార్లు

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 05:24 AM IST
వలస కార్మికులపై దూసుకెళ్లిన కార్లు

వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరతామనుకునే లోపే ఇద్దరు వలస కార్మికులకు ప్రమాదం జరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిని కార్లు ఢీ కొట్టడంతో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హర్యానాలోని అంబాలా ప్రాంతం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వలస కార్మికులపైకి SUV దూసుకొచ్చింది. ఒకరు స్పాట్ లోనే మరణించగా మరొకరి హాస్పిటల్ కు తరలించారు. 

వారు బీహార్ కు వెళ్తుండగా కారు మితిమీరిన వేగంతో వచ్చి అదుపు తప్పింది. డ్రైవర్ పారిపోవడంతో కారు సీజ్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన మరొక ఘటనలో 25ఏళ్ల కార్మికుడు శివ్ కుమార్ దాస్ ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ లోని సొంతింటికి వెళ్తున్నాడు. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని బ్రేకులు ఫెయిలై అదుపు తప్పిన కారు ఢీ కొట్టింది. 

డ్రైవర్ కు గాయాలు కాగా, కారు ధ్వంసం అయింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వేల సంఖ్యలో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. మార్చి నెలాఖరు నుంచి నడుచుకుంటూ, సైకిళ్ల మీద ప్రయాణిస్తున్న వారు ఇంకా వెళ్తూనే ఉన్నారు. అంతర్రాష్ట్రాల మధ్య రాకపోకలు ఉండకూడదని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిలిపివేయడంతో కాలి బాట పట్టారు. 

ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా టిక్కెట్ ధరలు అధికంగా ఉండటం, రిజిస్ట్రేషన్ పద్ధతి అర్థం కాకపోవడంతో ప్రాణాలకు తెగించి నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండగా మధ్యప్రదేశ్ లో ట్రక్ బోల్తాపడి ఆరుగురు కార్మికులు చనిప్యారు. 16మంది రైల్వే ట్రాకుల మీద పడుకోవడంతో గూడ్స్ ట్రైన్ వారి ప్రాణాలను చిదిమేసింది. రైళ్లు ప్రయాణించడం లేదని.. హైవేలపై నడవలేక రైలు పట్టాలపై ప్రయాణం సాగిస్తూ అక్కడే నిద్రపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Read Here>> ఇళ్లకు వెళ్లడం కంటే చావడమే బెటర్.. ఆకలి కడుపుతో మండుతున్న ఎండల్లో ప్రయాణం