Aarogya Setu యాప్‌లో మీ డేటా పదిలమేనా.. !

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 06:51 AM IST
Aarogya Setu యాప్‌లో మీ డేటా పదిలమేనా.. !

కరోనా వైరస్ పేషెంట్లను గుర్తించడానికి.. వారికి ఆరోగ్యపరమైన సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆరోగ్య సేతు. సోమవారం విడుదల చేసిన ఈ యాప్ లో ప్రతి ఒక్క యాప్ యూజర్ తమ వ్యక్తిగత వివరాలు కాంటాక్టుల వివరాలు, లొకేషన్ కూడా యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్ గురించే సేకరిస్తున్న ఈ డేటా 180రోజులు మాత్రమే ఉంటుందని ఆ తర్వాత పూర్తిగా డిలీట్ చేసేస్తామని అధికారులు చెబుతున్నారు. 

మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అవసరమైతేనే డేటాను వాడుతుంది. ఆరోగ్యం గురించి మాత్రమే ఇంకేమైనా సూచనలివ్వాలనే దానిపై స్పందిస్తుంది. మున్ముందు కూడా ఈ డేటా దీనికే వాడతాం. ఇతర అవసరాలకు కాదని స్పష్టం చేసింది.

ప్రస్తుత ప్రైవసీ పాలసీ ఆధారంగా యాప్ కొవిడ్ 19 పేషెంట్ డేటా 60రోజుల వరకూ ఉంచుతుంది. మిగిలిన యూజర్ల డేటా 45రోజుల వరకూ మాత్రమే ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రొటోకాల్ ఆధారంగా ఈ డేటా 180రోజుల వరకూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఈ లాక్‌డౌన్ ఇష్యూలను పర్యవేక్షించడానికి 11మంది ఆఫీసర్లు ఉంటారు. కొత్త ప్రొటోకాల్ లో వ్యక్తిగతంగానూ డేటాను 30రోజుల్లో డిలీట్ చేసేయమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. 

యాప్ లో షేర్ చేసిన డేటా యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పలు ఏజెన్సీలకు అనుమతి ఇస్తుంది. ఇలా 180రోజుల వరకూ ఉంచిన డేటా ఆ తర్వాత తొలగించబడుతుంది. 

ఈ సమయంలో అతి ముఖ్యమైన సమాచారంపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. దానిని అన్ని రాష్ట్రాల్లోని, జిల్లాల్లోని అధికారులు పర్యవేక్షిస్తారని ఐటీ సెక్రటరీ అజయ్ ప్రకాశ్ సానీ అన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, హెల్త్ మినిస్ట్రీ కలిసి ఆరోగ్య సేతు యాప్ ను బ్లూ టూత్ కాంటాక్ట్ ద్వారా ట్రేసింగ్ చేస్తుంటారు. ఐసీఎమ్మార్ ల్యాబ్ పోర్టల్స్ కు అందిన డేటాను కూడా వారు పరిగణనలోకి తీసుకుంటారు. 

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డేటాను ఐఐటీ మద్రాస్ కు పంపి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో నిర్ణయిస్తారు. డేటాను ఈ విధంగా విశ్లేషిస్తామని అజయ్ ప్రకాశ్ అంటున్నారు. 

ద నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ఆరోగ్య సేతు యాప్ ద్వారా డేటా కలెక్ట్ చేసుకోవడం, ప్రోసెసింగ్, మేనేజింగ్ చేయడంలో బాధ్యత వహిస్తుంది. ఇప్పటికే దీనిని 9.82కోట్ల మంది ఇండియన్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఎన్ఐసీ డేటా షేర్ చేసుకున్న ఏజెన్సీల జాబితా లిస్ట్ చేయాల్సి ఉంటుంది. 

COVID-19 ట్రీట్‌మెంట్‌కు మాత్రమే వాడాలనుకునే ఆరోగ్యసేతు యాప్ డేటా.. ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేస్తారనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ లో డేటా ప్రొటెక్షన్ బిల్లు పెండింగ్ లో ఉంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికే ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నామని ప్రైవసీకి ఎటువంటి భంగం వాటిల్లదని అంటున్నారు. 

ఇటీవల కాంగ్రెస్ సెక్యూరిటీకి భంగం కలుగుతుందని యాప్ పై ప్రశ్నలు లేవనెత్తింది. యాప్ ద్వారా కొవిడ్ 19 సోకిన పేషెంట్ల ఇన్ఫర్మేషన్ ఈజీగా హ్యాక్ చేయడం కుదురుతుందని చెప్పారు. ఎల్లియోట్ ఆల్డర్ సోన్ అనే హ్యాకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.