Gold Rate : బాబోయ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ మూడు ప్రాంతాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : బాబోయ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఆ మూడు ప్రాంతాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold woman (Credit @google)

Gold And Silver Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు గోల్డ్, సిల్వర్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గడిచిన రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతుంది. సోమవారం తులం బంగారంపై రూ. 220 పెరగ్గా.. ఇవాళ రూ. 330 పెరిగింది. ఏప్రిల్ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మే నెల ప్రారంభంలో కాస్త తగ్గిన గోల్డ్ ధర.. మళ్లీ పెరుగుతోంది. రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 550 పెరిగింది. రాబోయే రోజుల్లో గోల్డ్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. సోమవారం కిలో వెండిపై రూ. వెయ్యి పెరగ్గా.. ఇవాళ (మంగళవారం)సైతం కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో కిలో గోల్డ్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 90వేలకు చేరువలో ఉంది.

Gold price

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,380 వద్దకు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,530.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,350 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,380.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,400 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,430.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.88,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 88,500.
కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.85,000.
బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 82,400.

Gold

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.