KCR: బాగున్నారా.. అమ్మా.. మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్, శోభమ్మ దంపతులు.

KCR: బాగున్నారా.. అమ్మా.. మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు

Kcr Representative Image (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 6:33 PM IST
  • కేసీఆర్ ఇంటికి మహిళా మంత్రులు
  • సాదరంగా ఆహ్వానం పలికి కేసీఆర్ దంపతులు
  • ఆత్మీయంగా పలకరించి సంప్రదాయ పద్ధతిలో సత్కారం
  • మేడారం జాతరకు ఆహ్వానం

 

KCR: బాగున్నారా అమ్మా అంటూ.. రాష్ట్ర మహిళా మంత్రులను ఆత్మీయంగా పలకరించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆయన సాదర ఆహ్వానం పలికారు. అతిథి మర్యాదలు చేశారు. పసుపు కుంకుమ, చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ పద్ధతిలో సత్కారం చేశారాయన. దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Konda Surekha

Konda Surekha Representative Image (Image Credit To Original Source)

మరికొన్ని రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ని ప్రభుత్వం తరపున వారు ఆహ్వానించారు. కేసీఆర్ కి శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు మంత్రులు. అలాగే మేడారం ప్రసాదం అందించారు. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్, శోభమ్మ దంపతులు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. కాసేపు పరస్పర యోగ క్షేమాలు గురించి మాట్లాడుకున్నారు. అనంతరం మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Kcr House

Kcr House Representative Image (Image Credit To Original Source)

Also Read: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి 150 ప్రత్యేక రైళ్లు.. ఏఏ ప్రాంతాలకు వెళ్తాయంటే?.. వివరాలు ఇలా..