Skoda Kylaq Price : బిగ్ షాక్.. భారీగా పెరిగిన స్కోడా కైలాక్ కార్ల ధరలు.. ఏ మోడల్ ధర ఎంత పెరిగిందంటే? ఫుల్ డిటెయిల్స్..!
Skoda Kylaq Price : స్కోడా కైలాక్ మోడల్ ధరలు భారీగా పెరిగాయి. కంపెనీ స్కోడా కైలాక్ ధరను ఎంత పెంచింది? కొత్త ధరలేంటి? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Skoda Kylaq Price (Image Credit To Original Source)
- భారీగా పెరిగిన స్కోడా కైలాక్ కార్ల ధరలు
- స్కోడా కైలాక్ నెలవారీ ఈఎంఐ ఎంతంటే?
- స్కోడా కైలాక్ టాప్ వేరియంట్ ధర రూ. 19,295 పెంపు
Skoda Kylaq Price : కొత్త కారు కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. కార్ల ధరలు పెరిగాయి.. కార్ల తయారీ కంపెనీలు వరుసబెట్టి ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్ల కార్ల ధరలను పెంచగా తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా కార్ల ధరలను భారీగా పెంచేసింది. ఒకవేళ, మీరు స్కోడా కైలాక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇది మీకోసమే.. స్కోడా కైలాక్ కారు ధర ఎంత పెరిగింది? కొత్త ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
స్కోడా కైలాక్ కొత్త ధరలివే :
స్కోడా ఆటో ఇండియా ఇటీవల ఎంపిక చేసిన మోడళ్ల ధరలను సవరించింది. కైలాక్ నుంచి వచ్చిన సబ్-కాంపాక్ట్ SUV ధర రూ. 19,295 వరకు పెరిగింది. స్కోడా కైలాక్ ధరల పెరుగుదల ట్రిమ్ స్థాయిని బట్టి మారుతుంది. స్కోడా కైలాక్‌ను క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్ అనే 4 వేరియంట్‌లలో అందిస్తోంది. స్కోడా కైలాక్ క్లాసిక్ వేరియంట్ ధర రూ. 4,349 పెరిగింది. అయితే, సవరించిన ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.59 లక్షలుగా నిర్ణయించింది.
అదనంగా, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సిగ్నేచర్ వేరియంట్ ధర రూ. 10వేలు పెరిగింది. దాంతో ఇప్పుడు కొత్త ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 9.09 లక్షలకు చేరుకుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో సిగ్నేచర్ వేరియంట్ ధర కూడా రూ. 10వేలు పెరిగింది. సవరించిన ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 10.09 లక్షలకు చేరుకుంది.
స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 10,537 పెరిగి రూ. 10.44 లక్షలకు చేరుకుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్కోడా కైలాక్ సిగ్నేచర్+ వేరియంట్ ధర రూ. 11.44 లక్షలకు చేరుకుంది.

Skoda Kylaq Price (Image Credit To Original Source)
దాంతో అసలు ధర రూ. 9,736 పెరిగింది. అంతేకాకుండా, స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ వేరియంట్ ధర రూ. 15,341, మాన్యువల్, ఆటోమేటిక్ మోడళ్లలో రూ. 19,295 పెరిగింది. పెరిగిన కొత్త ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు, రూ. 12.99 లక్షలకు చేరుకున్నాయి.
స్కోడా మాత్రమే కాదు.. ఇతర కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్యంలో హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల కార్ల ధరలను పెంచుతున్నాయి తయారీ కంపెనీలు.
స్కోడా కైలాక్ నెలవారీ ఈఎంఐ :
మీరు ఢిల్లీలో స్కోడా కైలాక్ బేస్ వేరియంట్ కొనుగోలు చేస్తే.. అన్ని ఛార్జీలు కలిపి దాదాపు రూ. 8.57 లక్షలు ఖర్చవుతుంది. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత బ్యాంకు నుంచి రూ.6.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఈ కారు రుణంపై 9 శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్ల వరకు తీసుకుంటే నెలకు రూ. 20,892 ఈఎంఐగా చెల్లిస్తారు. ఇలా 3 ఏళ్లలో మొత్తం రూ. 7.52 లక్షలు చెల్లించాలి. ఇందులో కేవలం రూ. 95వేల వడ్డీనే చెల్లిస్తారు.
