iOS 26.3 Release : ఆపిల్ లవర్స్ మీకోసమే.. iOS 26.3 రిలీజ్ డేట్ ఇదిగో.. ఏయే ఐఫోన్లకు సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్ట్..!

iOS 26.3 Release : ఐఓఎస్ 26.3 వెర్షన్ అతి త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం పబ్లిక్ బీటా వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ iOS 26.3 జనవరి లేదా ఫిబ్రవరి 2026 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది.

iOS 26.3 Release : ఆపిల్ లవర్స్ మీకోసమే.. iOS 26.3 రిలీజ్ డేట్ ఇదిగో.. ఏయే ఐఫోన్లకు సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్ట్..!

iOS 26.3 Release (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 12:18 PM IST

iOS 26.3 Release : ఆపిల్ లవర్స్ కోసం సరికొత్త iOS 26.3 వెర్షన్ రాబోతుంది. ఆపిల్ గత ఏడాదిలో iOS 26 వెర్షన్ రిలీజ్ చేసింది. ప్రస్తుత స్టేబుల్ వెర్షన్ iOS 26.2 ఉండగా ఇప్పుడు, iOS 26.3 పబ్లిక్ బీటా వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వెర్షన్ లాంచ్ కొత్త ఫీచర్లు, ఎలిమెంట్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ ఫస్ట్ డెవలపర్ బీటా డిసెంబర్ 2025లో ప్రారంభమైంది. లీక్‌లు, పుకార్ల ప్రకారం.. iOS అప్‌డేట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో వెల్లడించాయి. రాబోయే ఐఓఎస్ 26.3 అప్ డేట్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

iOS 26.3 Release

iOS 26.3 Release (Image Credit To Original Source)

ఆపిల్ iOS 26.3 జనవరి 2026 చివరి నాటికి లేదా ఫిబ్రవరి 2026 మొదటి వారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి, పబ్లిక్ బీటా వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బీటాలో రిజిస్టర్ చేసుకున్న వారందరూ యాక్సెస్ చేయవచ్చు

Read Also : Oppo Reno 15 Series : పండగ చేస్కోండి.. ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!

సపోర్టు చేసే ఫోన్ల విషయానికొస్తే..
ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 17 సిరీస్‌లకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో కన్నా ఎక్కువ ఉన్న ఫోన్‌లకు మాత్రమే ఉంటాయి.

iOS 26.3 కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ :
iOS 26.3 అప్‌డేట్ ద్వారా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈజీగా డేటాను ట్రాన్స్ పర్ చేసుకోవచ్చు. ఇకపై మొబైల్ యూజర్లు తమ ఫోటోలు, నోట్స్, కాంటాక్టులను కూడా ఈజీగా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఇందుకోసం ఐఫోన్ పక్కనే ఉంచుకోవడం బెటర్.

iOS 26.3 అప్‌డేట్ ద్వారా రిమల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది. అలాగే, ఐఫోన్లు, ఇతర డివైజ్‌లకు థర్డ్ పార్టీ స్మార్ట్‌వాచ్‌లకు నోటిఫికేషన్‌ ఫార్వార్డ్ చేసేందుకు ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది.