Tilak Varma : నాలుగు రోజుల్లోనే కోలుకుంటాడు.. ప్రపంచకప్ కాదు.. కివీస్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ సిద్ధం.. హైదరాబాద్ కోచ్ కామెంట్స్..
తిలక్ వర్మ (Tilak Varma) నాలుగు రోజుల్లో కోలుకుంటాడని హైదరాబాద్ క్రికెట్ జట్టు కోచ్ డిబి రవితేజ తెలిపారు.
Tilak Varma is fine and will be ready for international action soon DB Ravi Teja (pic credit CREIMAS )
Tilak Varma : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ క్షేమంగా ఉన్నాడని, త్వరలో అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని హైదరాబాద్ క్రికెట్ జట్టు కోచ్ డిబి రవితేజ తెలిపారు. శస్త్రచికిత్స జరగడంతో తిలక్ వర్మ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలను రవితేజ తోసిపుచ్చారు. అతడు జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు సైతం సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.
‘బుధవారం రాజ్‌కోట్‌లో అతనికి జరిగిన శస్త్రచికిత్స చాలా చిన్నది. ఇందులో తీవ్రమైన లేదా ఆందోళనకరమైనది ఏమీ లేదు. అతను మూడు నుండి నాలుగు రోజుల్లో కోలుకుంటాడు.’ అని హైదరాబాద్ కోచ్ గురువారం క్రిక్‌బజ్‌తో తెలిపారు.
An optimistic update on Tilak Varma 👀#CricketTwitter #INDvsNZ #INDvNZ pic.twitter.com/ZnDov2obq2
— Cricbuzz (@cricbuzz) January 8, 2026
వాస్తవానికి ఈ రోజు (జనవరి 8న) జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో ఆడేందుకు తిలక్ సిద్ధంగా ఉన్నాడని, అయితే.. ఈ మ్యాచ్‌లో గెలిచినా కూడా నాటౌట్‌కు అర్హత సాధించే అవకాశం లేకపోవడంతో అతడి విషయంలో రిస్క్ తీసుకోవద్దని తాము అనుకున్నామని చెప్పారు. ప్రస్తుతం అతడు జట్టుతోనే ఉన్నాడన్నాడు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ కన్నా ముందు భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.
