Tata Safari Launch : కొంటే ఇలాంటి కారు కొనాలి.. 5-స్టార్ రేటింగ్‌తో టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్.. ఫ్యామిలీ కస్టమర్లకు ఫుల్ సేఫ్టీ..!
Tata Safari Launch : టాటా సఫారీ డీజిల్ వేరియంట్ మాత్రమే కాదు.. ఇకపై పెట్రోల్ వేరియంట్ కూడా కొనేసుకోవచ్చు. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Tata Safari Launch (Image Credit To Original Source)
- భారత మార్కెట్లోకి టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ లాంచ్
- ఇండియా NCAP నుంచి 5-స్టార్ రేటింగ్
- 1.5-లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్
- టాటా సఫారీ పెట్రోల్ ధర రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Tata Safari Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ వచ్చేసింది. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ లాంచ్ చేసింది. ఇప్పటివరకు టాటా సఫారీకి డీజిల్ ఆప్షన్ మాత్రమే ఉండేది.
కానీ, ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉండనుంది. కంపెనీ టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. మీరు కొత్త టాటా సఫారీ పెట్రోల్ కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. ఈ కొత్త టాటా కారు ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా సఫారీ పెట్రోల్ ధర :
కొత్త టాటా సఫారీ పెట్రోల్ ధర రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 25.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. కొత్త సఫారీ కోసం బుకింగ్‌లు మొదలయ్యాయి. అతి త్వరలోనే సేల్ ప్రారంభం కానుంది.

Tata Safari Launch (Image Credit To Original Source)
టాటా సఫారీ పెట్రోల్ ఇంజిన్ :
కొత్త టాటా సఫారీ పెట్రోల్ 1.5-లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 168bhp, 280Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. టాటా సఫారీ పెట్రోల్ ఇంజిన్ 25 కి.మీ/లీ వరకు మైలేజీ అందిస్తుంది.
Read Also : Poco M8 5G : కొత్త ఫోన్ కావాలా? పోకో M8 5జీ ఫోన్ ఆగయా.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
టాటా సఫారీ పెట్రోల్ ఫీచర్లు :
కొత్త టాటా సఫారీ పెట్రోల్ వేరియంట్ 14.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ అందిస్తుంది. ఈ కారులో ఫ్రంట్ కెమెరా వాషర్, డిజిటల్ ఎలక్ట్రానిక్ IRVM, ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్, ఆటో రివర్స్ డిప్‌తో మెమరీ ORVM, పవర్డ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ టాటా సఫారీ కారు ఇండియా NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది. అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. టాటా మోటార్స్ జనవరి 13న టాటా పంచ్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ చేయనుంది.
