Poco M8 5G : కొత్త ఫోన్ కావాలా? పోకో M8 5జీ ఫోన్ ఆగయా.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
Poco M8 5G : ఈ పోకో 5జీ ఫోన్ ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉంటుంది. 4కే వీడియో రికార్డింగ్ సపోర్టు చేస్తుంది. 50MP రియర్ కెమెరా కూడా ఉంది. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Poco M8 5G (Image Credit To Original Source)
- 120Hz రిఫ్రెష్ రేట్, 6.77-అంగుళాల భారీ స్క్రీన్‌తో పోకో M8 5G ఫోన్
- స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్, 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్
- 5,520mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
Poco M8 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో పోకో నుంచి అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఎమ్ సిరీస్ లైనప్‌లో పోకో M8 5G ఫోన్ లాంచ్ చేసింది. ఈ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు అందిస్తుంది.
ఈ ఫోన్ 6.77-అంగుళాల డిస్‌ప్లేతో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ పోకో ఫోన్ క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. పోకో M8 5G ఫోన్ స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోకో M8 5G స్పెసిఫికేషన్లు :
పోకో M8 5G ఫోన్ 6.77-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంకా, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 3200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
హుడ్ కింద ఈ పోకో ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 4nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ కూడా కలిగి ఉంది. 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
Read Also : BSNL Offer : BSNL బంపర్ ఆఫర్.. రూ. 1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. రోజుకు 2GB డేటా, 30 రోజులు ఫుల్ ఎంజాయ్..!
అదేవిధంగా, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS2పై రన్ అవుతుంది. 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా పొందవచ్చు. లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు కూడా అందిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 4K వీడియో రికార్డింగ్ సపోర్టు, 50MP రియర్ కెమెరాతో వస్తుంది.

Poco M8 5G (Image Credit To Original Source)
ఫ్రంట్ సైడ్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం సింగిల్ 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పోకో ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,520mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ అందిస్తుంది. అలాగే, 18W వైర్‌లెస్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
భారత్‌లో పోకో M8 5G ధర, లభ్యత :
భారత మార్కెట్లో పోకో M8 5G ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999కు లభిస్తోంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999కు లభిస్తోంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.21,999కు లభిస్తోంది.
అయితే, మొదటి 12 గంటల్లోపు ఫోన్ కొనుగోలు చేసిన వారికి కంపెనీ రూ.15,999 స్పెషల్ లాంచ్ ధర కూడా అందిస్తోంది. ఈ పోకో ఫోన్ జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానుంది.
