BSNL Offer : BSNL బంపర్ ఆఫర్.. రూ. 1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. రోజుకు 2GB డేటా, 30 రోజులు ఫుల్ ఎంజాయ్..!
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ కావాలా? యూజర్ల కోసం జనవరి 31 వరకు ఈ లిమిటెడ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ప్లాన్ ఎలా పొందాలంటే?
BSNL Offer (Image Credit To Original Source)
- బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్
- అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటా
- సిమ్ యాక్టివేషన్ నుంచి 30 రోజుల వ్యాలిడిటీ
- జనవరి 31, 2026 వరకు లిమిటెడ్ ఆఫర్
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ రూ. 1 రీఛార్జ్ ప్లాన్ మళ్లీ వచ్చేసింది. కస్టమర్ల నుంచి భారీగా డిమాండ్ పెరగడంతో బీఎస్‌ఎన్‌ఎల్ పాపులర్ రూ.1 ప్లాన్ తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. సెకండరీ సిమ్ కోసం బీఎస్ఎన్ఎల్ వాడే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.
ఈ ప్లాన్ మొదటిసారి అందుబాటులోకి వచ్చినప్పుడు యూజర్ల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధర కూడా కేవలం రూ. 1 ఉండటంతో ఎక్కువమంది సిమ్ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. మీరు కూడా ఈ లిమిటెడ్ ఆఫర్ పొందాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆఫర్ గడువు ముగిసేలోపు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ భారత్ అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్ యూజర్లకు రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. రోజుకు 2GB డేటా పొందవచ్చు.
ఇంటర్నెట్, చాటింగ్, యూట్యూబ్ వీడియోలు లేదా ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్ చూసేందుకు సరిపోతుంది. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ యాక్టివేట్ తేదీ నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీ ఫోన్‌లో సెకండరీ నంబర్‌గా బీఎస్ఎన్ఎల్ సిమ్ కావాలంటే ఇప్పుడే తీసుకోవచ్చు.

BSNL Offer (Image Credit To Original Source)
బీఎస్ఎన్ఎల్ రూ.1 ఆఫర్ ఎలా పొందాలంటే? :
ఈ ఆఫర్ కోసం ఆసక్తిగల వినియోగదారులు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధీకృత బీఎస్ఎన్ఎల్ రిటైలర్ వద్దకు వెళ్లాలి. కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందవచ్చు. రూ. 1 ప్లాన్‌తో యాక్టివేట్ అవుతుంది.
ఆ తర్వాత వినియోగదారులు వెంటనే కాల్స్, డేటా SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. ఆసక్తిగల కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ స్టోర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. జనవరి 31, 2026తో ఈ లిమిటెడ్ ఆఫర్ ముగియనుంది.
