Chiranjeevi Venkatesh : చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. ఫొటోలు వైరల్..
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటించడంతో ఈ ఈవెంట్ కి చిరంజీవి, వెంకటేష్ కలిసి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చిరు - వెంకీ ఒకే స్టేజిపై కలిసి కనపడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్లో ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఈ సాంగ్ కి వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి చిరంజీవి ముందు డ్యాన్స్ చేయడంతో ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.






















